- విజయ్ పార్టీపై డీఎంకే, అన్నాడీఎంకే విమర్శలు
చెన్నై: యాక్టర్ విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) సిద్ధాంతాలపై డీఎంకే, అన్నాడీఎంకే విమర్శలు గుప్పించాయి. తమ ఐడియాలజీనే కాపీ చేశారని డీఎంకే, అన్ని పార్టీల సిద్ధాంతాలను కలగలిపి కాక్ టెయిల్ ఐడియాలజీ తెచ్చారని అన్నాడీఎంకే విమర్శించాయి. ‘‘మా సిద్ధాంతాలనే టీవీకే కాపీ చేసింది. ఇవన్నీ మేం ఎప్పుడో చెప్పాం.. వాటినే ఫాలో అవుతున్నాం.
టీవీకే లాంటి పార్టీలను చాలా వాటిని చూశాం. మా పార్టీ సిద్ధాంతాలు గొప్పవి. ప్రజా సమస్యలపైనే మేం పోరాడుతాం. జైళ్లకు కూడా వెళ్లాం. మాలాగా టీవీకే నేతలు ప్రజా సమస్యలపై పోరాడి జైళ్లకు వెళ్తారా?” అని డీఎంకే లీడర్ టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. ‘‘టీవీకేది కాక్ టెయిల్ ఐడియాలజీ. అన్ని పార్టీల సిద్ధాంతాలను కలగాపులగం చేసింది. ఇది కొత్త సీసాలో పాత సారా లాంటిది” అని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవాయ్ సత్యం అన్నారు. ఇక టీవీకేతో తమ ఓటు బ్యాంక్ పై ఎలాంటి ప్రభావం ఉండదని, ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకునే అది చీలుస్తుందని బీజేపీ లీడర్ హెచ్.రాజా పేర్కొన్నారు.