'సనాతన ధర్మం వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కుమారుడు తమిళ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వెనకేసుకొచ్చారు. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓ వీడియోను విడుదల చేశారు. డీఎంకే అంటే డెంగ్యూ, మలేరియా, కోసు(దోమ) అని వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు.
డీఎంకే డ్రామాలాడుతుందన్నారు అన్నామలై. అధికారంలోకి వచ్చిన మొదట్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారు.. రెండో ఏడాది సనాతన ధర్మాన్ని రద్దు చేయాలన్నారు.. మూడో ఏడాది సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని చెప్పారు. నాలుగో ఏడాది నేను హిందువుని, నా పార్టీ సభ్యులు 90 శాతం హిందువలు అన్ని చెప్పావు.. ఇక ఐదో ఏడాది.. నేను పక్కా హిందువుని అంటావు..తమిళనాడులో ఎన్నో దశాబ్దాలుగా ఈ నాటకాన్ని చూస్తూనే ఉన్నాను అని అన్నామలై అన్నారు.
ALSO READ : 18 ఎకరాలు.. రూ. 5 వేల కోట్లు : దేశంలోనే అతిపెద్ద రియల్ డీల్
‘‘ఎన్నికల రాగానే అమర్, అక్బర్, ఆంథోని అయిపోతావు.. రాహుల్ గాంధీ కూడా గత 17 యేళ్లుగా ఒక రాష్ట్రంలో అమర్ గా, మరో రాష్ట్రంలో అక్బర్ గా , ఇంకో రాష్ట్రంలో ఆంళోని మారు.. అయినప్పటికీ విఫలమయ్యారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో డీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని’’ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై జోస్యం చెప్పారు.