రాజ్యసభకు కమల్ హాసన్‌‌‌‌.. తమిళనాడు నుంచి నామినేట్ చేయనున్న డీఎంకే

రాజ్యసభకు కమల్ హాసన్‌‌‌‌.. తమిళనాడు నుంచి నామినేట్ చేయనున్న డీఎంకే

చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌‌‌‌ఎం) పార్టీ చీఫ్  కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. సీఎం స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అతడిని తమిళనాడు నుంచి నామినేట్ చేయనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్​హాసన్​ ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

గత ఏడాది లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారం కోసం డీఎంకే నేతృత్వంలోని కూటమితో కమల్​ హాసన్‌‌‌‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ చేతులు కలిపింది. ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికలకు కూటమిలో భాగంగా ఎంఎన్‌‌‌‌ఎం ఒక స్థానాన్ని కూడా దక్కించుకుంది. 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చినందుకు ఒప్పందంలో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్ కమల్​కు రాజ్యసభ సీటును హామీ ఇచ్చినట్టు సమాచారం.