ఈరోడ్ (తమిళనాడు): తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ఈ రోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలో విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి వీసీ. చంద్రికుమార్ 91,558 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 1,15,709 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి నామ్ తమిళర్ కట్చీ (ఎన్ టీకే) అభ్యర్థి సీతాలక్ష్మికి 24,151 ఓట్లు వచ్చాయి. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఎలంగోవన్ ప్రాతినిధ్యం వహించారు.
ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఈ రోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలో 46 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 44 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీపడ్డారు. ఎఐఎడీఎంకేతో సహా ప్రతిపక్ష పార్టీలన్ని ఈ ఉప ఎన్నికను బాయ్ కాట్ చేశాయి. ఈ స్థానానికి ఫిబ్రవరి 5న ఎన్నిక జరగగా శనివారం కౌంటింగ్ ముగిసింది.