నిద్ర, ఆహారం మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నిద్ర లేమితో అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. అంతేకాదు దీనివల్ల 'మగవాళ్లకు ఆడవాళ్ల లక్షణాలు వస్తాయి' అంటున్నారు వైద్యులు. ఆధునిక జీవన శైలితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, పోర్నోగ్రఫి ప్రభావంతో యువతలో 'హోమో సెక్స్' ప్రవర్తన కూడా పెరుగుతోంది అంటున్నారు. ఇది ఇలా కొనసాగితే మెట్రో నగరాల్లో జంబలకడిపంబ సినిమాలోని సీన్లు రియల్ లైఫ్లో కూడా కనిపిస్తాయేమో!
యంత్రం లాంటి మనిషి శరీరానికి నిద్ర చాలా అవసరం. జీవగడియారం ప్రకారం ఏ టైంకి చేయాల్సిన పనులు ఆటైంలో చేయాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర వుతాయి. రాత్రంతా మేల్కొని, పొద్దంతా పడుకున్నా హార్మోన్ల విడుదలలో తేడా వస్తుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మగవాళ్లలో రాత్రి పూట టెస్టోస్టిరాన్ లాంటి 'లైంగిక' హార్మోన్లు విడుదలవుతాయి. రాత్రి పూట (ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు) మేల్కొని ఉంటే, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోయే ముప్పు ఉంటుంది.
Also Read :వీరు హోలీ ఆడారంటే ఇబ్బందులే... ఈ తప్పులు అసలు చెయొద్దు...
అదే సమయంలో మగవాళ్ల శరీరంలో ఉండే ఆడవాళ్లకు సంబంధించిన ఈస్టదయాల్(ఈ2) హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతో తెలియకుండానే మగవాళ్లలో ఆడవాళ్ల లక్షణాలు వస్తాయి. ప్రవర్తన కూడా మారే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. అయితే, అతికొద్ది మందిలో మాత్రమే ఇలా జరుగుతుందని ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహు ల్రెడ్డి చెప్తున్నారు. అల్కాహాల్ అధికంగా తీసుకోవడం, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, స్మార్ట్ఫోన్ల రేడియేషన్, జంక్ ఫుడ్, విటమిన్ డి లోపం, కాలుష్యం.. హార్మో సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. ఇవే కారణాల వల్ల ఆడవాళ్లలో నూ 'మేల్ హార్మోన్లు' పెరుగుతున్నాయని, పీసీఓడి, అవాంఛిత రోమాలు వస్తుండడం ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లేనని గైనకాల జిస్ట్ లు తెలిపారు.
ఆలోచనలో మార్పు
అధికశాతం మగవాళ్లు టెస్టోస్టిరాన్ హార్మోన్ కేవలం శృంగారం కోసమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ, శరీరంలోని అనేక అవయవాలపై టెస్టోస్టిరాన్ ప్రభావం ఉంటుందని సీనియర్ ఆండ్రాలజిస్ట్, డాక్టర్ కృష్ణ చైతన్య అంటున్నారు. 'మారుతున్న జీవనశైలి వల్ల దశాబ్ద కాలంగా హార్మోన్ల అస మతుల్యత పెరుగుతూ వస్తోంది. టెస్టోస్టిరాన్ తగ్గితే బ్రెస్ట్ సైజ్ ఉండాల్సిన దానికంటే ఎక్కు పవుతుంది. ఇలా మగవాళ్లలో బ్రెస్ట్ పెరగడాన్ని 'గైనకోమాస్టియా' అంటారు. మరోవైపు టెస్టోస్టిరాన్ లోపంతో మెదడుపై ప్రభావం పడి, ఆలోచనల తీరు మారుతుంది.
ప్రవర్తన లోతేడా వస్తుంది. శుక్రకణాల ఉత్పత్తితోపా టు గుండె సరిగ్గా పనిచేయడానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి, ఆలోచన విధానం సరైన రీతిలో ఉండడానికి, మెంటల్ హెల్త్ సక్రమంగా ఉండడానికి కూడా టెస్టోస్టిరాస్ అవసరం. టెస్టోస్టిరాన్ తగ్గిపోయినవాళ్లలో ఒబేసిటి పెరుగుతుంది. కండరాల శక్తి, చురుకుదనం తగ్గిపోతుంది. ఎముకలు వీక్ అవుతాయి. టెస్టోస్టిరాన్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. లైంగిక ఇబ్బందులు, సంతానలేమి సమస్య పెరగ డంలో టెస్టోస్టిరాన్ లోపమే ప్రధాన కారణం అని ఆయన చెప్పారు. టెస్టోస్టిరాన్ లోపాన్ని వ్యాయామం, సరైన ఆహార నియమాలతో అధిగమించవచ్చు అని కృష్ణ చైతన్య అంటు న్నారు. ఎక్సర్ సైజ్తో టెస్టోస్టెరాస్ ఉత్పత్తి సమపాళ్లలో ఉంటుందని, కనీసం వారానికి ఒకసారైనా వ్యాయామం చేస్తూ, పోషకాహా రం తీసుకోవాలని ఆయన సూచించారు.
తగ్గుతున్న శుక్రకణాల ఉత్పత్తి
గతంలో ఆడవాళ్లలోనే సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపించేవి. ఆధునిక జీవన విధానంలో స్మార్ట్ఫోన్లు, పని ఒత్తిడి పెరిగి మగవాళ్లలో శుక్రకణాల ఉత్పత్తి, సెక్స్ పై ఆసక్తి తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మగవాళ్లలో సమస్యల కారణంగానే 35-40శాతం జంటలు సంతానలేమి సమ స్యను ఎదుర్కొంటున్నాయని శకుంతల వెల్లడించారు. ఇందులోనూ అధికశాతం శుక్రకణాల కౌంట్ తక్కువగా ఉన్నవాళ్లే ఉన్నారని, హైడ్రోసీల్, వెరికోసీల్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నవాళు
కొద్ది శాతమేనని ఆమె వివరించారు.
మగవాళ్లలో పెరుగుతున్న పని ఒత్తిడి, హైపర్ టెన్షన్తో స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యత తగ్గిపోతున్నాయని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. ఇన్ ఫెర్టిలిటీ (వ్యంధత్వ) సమస్య రోజు రోజుకూ పెరిగిపోవడానికి ఒత్తిడే ముఖ్య కారణమని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 నుంచి 15 శాతం మంది మగవాళ్లు ఏదో ఒక స్థాయిలో వ్యం ధత్వ సమస్యను ఎదుర్కొంటుండడం గమ నార్హం. దీంతో హైదరాబాద్లో ప్రత్యేకంగా మగవాళ్ల కోసమే నిర్వహించే 'మెన్స్ క్లినిక్స్' సంఖ్య పెరుగుతోంది.