Kitchen Hacks: పాలు పొంగకుండా ఈ టిప్స్ పాటించండి.. గిన్నెలో అలా కుదురుగా మరుగుతాయి అంతే..!

Kitchen Hacks: పాలు పొంగకుండా ఈ టిప్స్ పాటించండి.. గిన్నెలో అలా కుదురుగా మరుగుతాయి అంతే..!

కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు ఆ వేడికి అప్పుడప్పుడు చికాకు వస్తుంటుంది కదూ. దానికి తోడు పాలు, టీ పొంగినప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలు, లేదా టీ పొంగినపుడు గిన్నెకు అంటుకుని మరకలు పడటం, స్టవ్ పైన పొంగడంతో జిడ్డుగా మారడం.. గ్యాస్, మిల్క్ కలిసి ఏదో కాటు వాసన రావడం.. ఇవన్నీ కిచెన్ లో చికాకు తెప్పించే అంశాలే. పాలు పొంగకుండా.. గిన్నెలోనే అలా కుదురుగా మరగాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం..

పాత్రకు నెయ్యి లేదా బటర్ అప్లై చేయండి:

పాలు, టీ వేడి చేసే ముందు గిన్నెకు పై భాగంలో (ఎడ్జ్) బటర్ లేదా నెయ్యి అంటించండి. పాలు పొంగి నురగ బయటకు పడకుండా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ తో పాలు పొంగకుండా, స్టవ్ పాడవ్వకుండా చేయొచ్చు.

గిన్నె పై భాగంలో స్పూన్ ఉంచండి:

పాలు మరిగిస్తున్నపుడు పాత్ర పై భాగంలో చెక్కతో చేసిన స్పూన్ ఉంచండి. ఇది పాల నురగ పొంగి కిందకు పడకుండా ఆపుతుంది. దాదాపు నురగను కంట్రోల్ చేస్తుంది. పాల నుంచి వచ్చే టెంపరేచర్ ను కంట్రోల్ చేయడం వలన పాలు పొంగకుండా ఉంటాయి. 

లో ఫ్లేమ్ లో మరిగించండి:

ఎక్కువ వేడి తగలడం వలన టీ, మిల్క్ కు వెంటనే నురగలు (ఫోమ్) ఏర్పడే స్వభావం ఉంటుంది. అందుకోసం చిన్న మంటతో లేదా మీడియం ఫ్లేమ్ తో మరిగించండి. పాలను కలపడం వలన పొంగకుండా నిరోధించవచ్చు. 

పాత్రపైన స్టీల్ స్పూన్ ఉంచండి:

చెక్క స్పూన్ లేకపోతే గిన్నె పైన స్టీల్ స్పూన్ పెట్టినా నురగను కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్ ను కంట్రోల్ చేయడం వలన పాలు పొంగకుండా ఉంటాయి. 

పెద్ద గిన్నెను వాడండి:

తక్కువ పాలు ఉన్నాయి కదా చిన్న పాత్రలను వాడటం వలన కూడా పొంగే అవకాశం ఉంటుంది. అందుకు బదులుగా పెద్ద పాత్రలను వాడితే పాల నురగ పైకి వచ్చినా.. మళ్లీ తగ్గిపోతుంటుంది. దీంతో పాలు పొంగకుండా ఉంటాయి. 

ఈ టిప్స్ వాడి కిచెన్ లో సింపుల్ గా.. చికాకు లేకుండా పాలు, టీ లాంటి డ్రింక్స్ ను మరిగించండి. 

ALSO READ | Good Health : పుచ్చకాయలు కొంటున్నారా.. మంచిదా కాదా అనేది ఇలా తెలుసుకోండి..!