విద్యాసంస్థల్లోకి ఎవ్వరినీ రానివ్వొద్దు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలోకి అనుమతిలేకుండా ఎవ రినీ రానివ్వొద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఉన్నతాధికారుల పర్మిషన్​ లేకుండా విద్యాసంస్థల పరిధిలో ఫొటోలు, వీడియోలు తీయనియవద్దని స్పష్టం చేశారు. ఇటీవల డీఈవోలతో జరిగి న సమావేశంలో ఈ మేరకు ఆమె ఆదే శాలు జారీచేశారు. డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాల్లోనూ హెడ్మాస్టర్లకు డీఈవోలు సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇస్తున్నారు.