దుబ్బాక రిజల్ట్స్​ ప్రకటించొద్దు

కలెక్టర్​కు ఇండిపెండెంట్ అభ్యర్థుల వినతి

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలింగ్​ వరకు అనేక అవకతవకలు జరిగాయని  ఇండిపెండెంట్​ అభ్యర్థులు ఆరోపించారు. ఎన్నికల రిజల్ట్స్​ వెల్లడించకుండా నిలిపివేయాలంటూ కోరుతూ ఇండిపెండెంట్​అభ్యర్థులు సాయన్న, నరేశ్, విక్రంరెడ్డి శుక్రవారం ఎన్నికల జిల్లా అధికారి, కలెక్టర్ ​భారతి హొళికెరికి వినతిపత్రం అందజేశారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, అధికార యంత్రాంగం ఎన్నికల రూల్స్​ ఉల్లంఘించారని వినతిపత్రంలో  పేర్కొన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

For More News..

మాట్లాడాలని పిలిచి గ్యాంగ్ రేప్, మర్డర్

రైతులు పొలాలకు పోలేకపోతున్నరు.. రోడ్లెయ్యండి