మౌనంగా ఉండొద్దు..ఏవిధంగా సాయం చేయగలరో చేయండి

  • యుద్ధం గురించి నిజాలు చెప్పండి జెలెన్ స్కీ 
  • రష్యా మిగిల్చిన నిశబ్దాన్ని సంగీతంతో భర్తీ చేసి మా దీన గాధను  ప్రపంచానికి తెలపండి
  • గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవంలో జెలెన్ స్కీ వర్చువల్ మెసేజ్

ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివెల్ గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవంలో వర్చువల్ మెసేజ్ పంపించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఉక్రెయిన్ పై బాంబు దాడులు చేసి రష్యా.. భయంకరమైన సైలెన్స్ ని మిగిల్చిందన్నారు జెలెన్ స్కీ. ఆ నిశబ్ధాన్ని సంగీతంతో ఫిల్ చేసి ఉక్రెయిన్ దీన గాథను ప్రపంచానికి తెలియజేయండన్నారు. జెలెన్ స్కీ మాట్లాడిన రికార్డెడ్ వీడియో మెసేజ్ ను గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శించారు. ఉక్రెయిన్ కథను ప్రపంచానికి తెలియజేయండని పిలుపునిచ్చారు. సోషల్ నెట్ వర్క్ సైట్లలో యుద్ధం గురించిన నిజాలు చెప్పాలన్నారు.

ఉక్రెయిన్ కు ఏవిధంగా సాయం చేయగలరో చేయండి.. కానీ మౌనంగా మాత్రం  ఉండకండని భావోద్వేగానికి గురయ్యారు జెలెన్ స్కీ. అందరిలాగే... ఉక్రెయిన్లు కూడా స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నారు అని అన్నారు. అన్ని సిటీల్లో లాగే.. ఉక్రెయిన్ లో కూడా మల్లీ ప్రశాంతత ఏర్పడేలా చూడాలని అందర్నీ అభ్యర్థించారు. జెలెన్ స్కీ వీడియో సందేశం తర్వాత.. ప్రముఖ అమెరికా సింగర్ జాన్ లెజెండ్ ఉక్రెయిన్ మ్యుజీషియన్లతో కలిసి ప్రదర్శనిచ్చారు. ప్రదర్శన జరుగుతున్నంతసేపు వెనుక స్క్రీన్ పైన ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ ఫొటోలు ప్రదర్శించారు.

 

ఇవి కూడా చదవండి

రూటు మార్చిన రష్యా.. దక్షిణ ప్రాంతాల్లో దాడులు

ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?

త్రివిక్రమ్ శ్రీనివాస్కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్