ఇందిరమ్మ ఇండ్లలో దళారులను నమ్మొద్దు

ఇందిరమ్మ ఇండ్లలో దళారులను నమ్మొద్దు
  • రాష్ట్ర  గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ 

మునగాల, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ సూచించారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండ్ల స్కీమ్ లో పైలట్ గ్రామమైన సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో,  నడిగూడెం మండల కేంద్రంలో నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. 

ఆయన మాట్లాడుతూ ఇల్లు మంజూరైన ఏ ఒక్క లబ్ధిదారుడు బిల్లుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని పేర్కొన్నారు. బేస్ మెంట్ లెవల్ పూర్తవగానే మరుసటి రోజే లబ్ధిదారుడి అకౌంట్ లో ప్రభుత్వం రూ. లక్ష జమ చేస్తుందన్నారు. ఇలా మూడు సార్లు అమౌంట్ జమవుతుందని చెప్పారు.  లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన పలు సూచనలు చేశారు. 

ఇండ్ల స్కీమ్ ను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష,  తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేశ్, మునగాల మాజీ వైస్ ఎంపీపీ  బుచ్చి పాపయ్య, మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి వీరబాబు, హౌసింగ్ శాఖ సహాయ ఇంజనీర్ మూర్తి ఉన్నారు.