- ది వైజాగపటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లిక్
హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ షాపింగ్ మాల్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ది వైజాగపటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్ అన్నారు. కొంతమంది పోటీదారులు సీఎంఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఆ సంస్థ లోగోను మార్ఫింగ్ చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న సంస్థలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని చెప్పారు.ఈ పోస్టుపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ తెలిపారు. సీఎంఆర్ సంస్థపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ది వైజాగపటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీకృష్ణ అన్నారు.