జనవరి 28 వరకు మిల్లులకు పత్తి తేవొద్దు

ములుగు, వెలుగు : ములుగు అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ పరిధిలోని మూడు జిన్నింగ్‌‌‌‌ మిల్లుల్లో పత్తి నిల్వలు అధికంగా ఉన్నందున ఈ నెల 28 వరకు రైతులెవరూ మిల్లులకు పత్తిని తేవొద్దని మార్కెట్‌‌‌‌ కమిటీ సెక్రటరీ సుచిత్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి 29వ తేదీని పత్తిని తీసుకురావాలని సూచించారు. రైతులు గమనించి, సహకరించాలని కోరారు.