మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!

మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!

ప్రజల ఆరోగ్యం కన్నా ఎకానమీ ముఖ్యం కాదు

దీనిపై ఆర్థిక శాఖే రిప్లే ఇవ్వాలి: సుప్రీంకోర్టు
వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులకు రూ. 2 లక్షల కోట్లు నష్టం: రిజర్వ్ బ్యాంక్

న్యూఢిల్లీ: మారటోరియం టైమ్‌‌‌‌లో  అప్పులపై వడ్డీని వసూలు చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తీసుకుంది. ఈ అంశంపై దాఖలైన పబ్లిక్‌‌‌‌ ఇంట్రస్ట్‌‌‌‌ లిటిగేషన్‌‌‌‌(పిల్‌‌‌‌)ను కోర్టు విచారిస్తోంది. వడ్డీలను మాఫీ చేస్తే బ్యాంకులకు రూ. 2 లక్షల కోట్లు నష్టం వస్తుందని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కోర్టుకు సమాధానమిచ్చింది. దీనిపై కోర్టు  ఘాటుగానే స్పందించింది. ప్రజల ఆరోగ్యం కన్నా దేశ ఎకానమీ ముఖ్యం కాదని పేర్కొంది. కాగా మారటోరియం టైమ్‌‌‌‌లో లోన్స్‌‌‌‌పై వడ్డీలను మాఫీ చేయాలని బ్యాంకులను ఆదేశించలేమని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కోర్టుకు సమాధానం ఇచ్చింది. ఇది బ్యాంకులను ఆర్థికంగా నష్టపరుస్తుందని పేర్కొంది. దీంతో మారటోరియం టైమ్‌‌‌‌లో వడ్డీని మాఫీ చేస్తారా లేదా వసూలు చేస్తారా అనే అంశంపై ఆర్థిక శాఖే సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అసాధారణమని, ఈ అంశం చాలా తీవ్రమైనదని పేర్కొంది.

ఒక వైపు ప్రజలకు మారటోరియం ఇస్తూనే మరోవైపు వడ్డీలను(మారటోరియం టైమ్‌‌‌‌లో) వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ‘ఇందులో రెండు అంశాలున్నాయి. మారటోరియం టైమ్‌‌‌‌లో లోన్స్‌‌‌‌పై వడ్డీలను, వడ్డీలపై వడ్డీలను వసూలు చేయకూడదు’ అని జస్టిస్‌‌‌‌ భూషణ్‌‌‌‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం తరపున సొలిసటర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌ తుషార్‌‌‌‌‌‌‌‌ మెహతా వాదించారు. ఆర్థిక శాఖతో చర్చించి ఈ 2 ప్రశ్నలకు స్పందిస్తానని  కోర్టుకు చెప్పారు.  జూన్‌‌‌‌ 12 లోపు ప్రభుత్వ సమాధానాన్ని ఫైల్‌‌‌‌ చేయడానికి కోర్టు మెహతాకు అవకాశం ఇచ్చింది. మారటోరియం టైమ్‌‌‌‌లో లోన్స్‌‌‌‌పై వడ్డీని వసూలు చేస్తుండడంపై ఆర్‌‌‌‌‌‌‌‌బీఐకి కోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆగ్రాకి చెందిన గజేంద్ర శర్మ సుప్రీం కోర్టులో పిల్‌‌‌‌ వేశారు. బ్యాంకుల లాభాన్నే ప్రభుత్వం చూస్తోందని ఈయన తరపు న్యాయవాది కోర్టులో చెప్పారు. ప్రజల ఆరోగ్యం కన్నా ఎకానమి గొప్పది కాదని జస్టిస్‌‌‌‌ భూషణ్‌‌‌‌ విచారణ సందర్భంగా పేర్కొన్నారు.

రూ. 38.68 లక్షల కోట్ల అప్పులకు మారటోరియం

ఇండియన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌లో ఉన్న రూ. 100 లక్షల కోట్ల అవుట్​ స్టాండింగ్‌‌‌‌ లోన్లలో రూ. 38.68 లక్షల కోట్లు ప్రస్తుతం ఆరు నెలల మారటోరియం కింద ఉన్నాయని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అంచనావేసింది.  కార్పొరేట్‌‌‌‌, రిటైల్‌‌‌‌ బారోవర్ల నుంచి వచ్చిన మారటోరియం రిక్వెస్ట్‌‌‌‌లను పరిగణనలోకి తీసుకొని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఈ లెక్కలను ప్రకటించింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 31, 2019  నాటికి బ్యాంకింగ్‌‌‌‌ అవుట్​ స్టాండింగ్‌‌‌‌ లోన్ బుక్‌‌‌‌లో వీరి వాటా  రూ. 60 లక్షలు కోట్లుగా ఉంది. ఈ  రూ. 60 లక్షల కోట్లలో వర్కింగ్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ లోన్స్, జనవరి–మార్చి 2020 లో పంపిణి చేసిన లోన్స్‌‌‌‌ను యాడ్‌‌‌‌ చేయలేదు. మారటోరియం కింద నెలకు బ్యాంకులకు రావాల్సిన వడ్డీ డబ్బులు రూ. 33,500 కోట్లు వాయిదా పడ్డాయని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పేర్కొంది.

For More News..

ఫ్యామిలీస్ కి దూరంగా..

ఐపీఎల్‌‌ కోసం బీసీసీఐ లాస్ట్ ఆప్షన్!

గుళ్లలో తీర్థ ప్రసాదాలు వద్దు