బీమా రంగంలో ఎఫ్​డీఐల అవసరం లేదు

బీమా రంగంలో ఎఫ్​డీఐల అవసరం లేదు
  • అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం

బషీర్ బాగ్, వెలుగు: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్​డీఐ) పరిమితి పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. బషీర్​బాగ్​లో మంగళవారం ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత మిశ్రా మాట్లాడారు. 

బీమా పరిశ్రమలో ఎఫ్​డీఐల అవసరం ఏమాత్రం లేదన్నారు. విదేశీ పెట్టుబడిదారులను తృప్తి పరచడానికి బడ్జెట్​లో  కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలు బీమా పరిశ్రమను 1956 కంటే ముందు రోజులకు తీసుకువెళ్తాయన్నారు. పాలసీదారులు, సాధారణ పౌరులు, ప్రభుత్వ రంగ బీమా పరిశ్రమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ అనాలోచిత నిర్ణయాలపై ప్రజల మద్దతుతో పోరాటాలు చేస్తామన్నారు. అందరూ  భాగస్వాములై ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.