Good Health: తరచు టెన్షన్ పడుతున్నారా.. లైఫ్ స్టైల్ మారాల్సిందే..!

Good Health:  తరచు టెన్షన్ పడుతున్నారా..  లైఫ్ స్టైల్ మారాల్సిందే..!

కొత్త ఏడాదిలో ఏదో సాధించాలన్న ప్రణాళిక సిద్ధమైపోయింది. పాత ఏడాదిలో సాధించాలనుకున్న పసులెన్నో పెండింగ్లో ఉండిపోయాయ్.. పాత బాధలు దించుకోకుండానే కొత్త బాధలు రెడీగా ఉన్నాయి. ఈ మోయలేని బరువే మన మెదడుని ఒత్తిడితో చిత్తుచేస్తోంది. కలల కనండి. ఆ కలలు సాధించుకునే ప్రయత్నంలో స్ట్రెస్ ని దరిచేరనీయకండి. లైట్ గా తీసుకున్నారే హైపర్ టెన్షన్ని ఆహ్వానించినట్లే.. అది గుండెల్ని పిండేస్తుంది

పాతికేళ్లు నిండని వాళ్లకు కూడా  గుండె పోటు వస్తోంది.ఈ మాట విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ అంత చిన్న వయసులో గుండెను కబళించే అవకాశం ఎవరిచ్చారో ఆలోచించరు. ఇది తెలియకనే ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. మన దేశంలో ఏటా సంభవిస్తున్న మరణాల్లో 10.8 శాతం మరణాలకు కారణం హైపర్ టెన్షన్.  భారతీయుల అకాల మరణాలకు ప్రధానమైన కారణం హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) ని ఐసీఎంఆర్ లెక్కలు చెబుతున్నాయి.

ముగ్గురిలో ఒకరికి

హైపర్ టెన్షన్ మూలంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు, కోపం, మతిమరుపు వంటి సమస్యలెన్నో చుట్టిముట్టి ముప్పు తిప్పలు పెడతాయి. ఈ దీర్ఘకాలిక సమస్య గుండె కవాటాలో రక్తప్రసరణను మెదడు రక్త నాణాల్లో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. వీటివల్ల ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. హార్ట్ స్ట్రో క్, బ్రెయిన్ స్టోక్ లలో హైపర్ టెన్షన్ వల్ల వచ్చేవి 29 శాతం.

Also Read : పరకడుపున టీ, కాఫీలు అస్సలు తాగొద్దు..

వయసు తగ్గుతోంది

అధిక రక్తపోటు... అంటే .. హై బీపీ  అని పిలిచే ఈ హైపర్ టెన్షన్ ఒకప్పుడు పెద్దలకు మాత్రమే వచ్చే జబ్బుగా ఉండేది.
కానీ ఇప్పుడు వయసుని తగ్గించుకుంటూ చిన్నవాళ్లనూ వేధిస్తోంది. కారణం చిన్న వయసులోనే ఉద్యోగాలు, వ్యాపారాలు, పెద్ద బాధ్యతలు తలకెత్తుకోవడమే. ఈ భాధ్యతల వల్ల తలెత్తే మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అనుభవం లేక, హైపర్ టెన్షన్ ని గుర్తించక చిన్న వయసులోనే గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయి. సమస్య ఇంత భయంకరంగా ఉన్న అవగాహన, ఆచరణతో ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ అవగాహనా లోపమే నిండు ప్రాణాలు తీస్తోంది.

అటెన్షన్

ప్రతి పనికీ ఓడెడ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ దగ్గర పడుతున్నా కొద్దీ గుండెవేగం పుంజుకుంటుంది. ఎక్కువగా పని చేయాల్సిన అవసరం పెరుగుతున్నా కొద్దీ పనిచేయలేని స్థితికి చేరడంతో చేతులెత్తేస్తాం. ఇంకా ఎక్కువగా నష్టపోతాం. చేసే సామర్థ్యం ఉన్నా వెంటాడే సమయం, అవుతుందో లేదో అన్న సందేహం మనసుని భయపెడుతుంది. ఈ మానసిక ఒత్తిడి ఎక్కువగా నష్టం చేస్తుంది. పోషకాహార లోపం, బ్యాక్టీరియా, వైరస్ లు  రోగాలకు కారణమనుకుంటాం కానీ వీటికన్నా ప్రాణాంతకమైన రోగం హైపర్ టెన్షన్.. ఇది కంటికి కనిపించదు. మనలో ఉన్నా... ఉన్నట్లనిపించదు. ప్రతి ఒక్కరిలో ఎప్పుడో ఒకప్పుడు నిద్ర లేస్తూనే ఉంటుంది. నాలో లేదు. నాకేం కాదని నిర్లక్ష్యం చేయకుండా. అవగాహనతో ఉంటే సైలెన్స్ కిల్లర్ సైడై పోతుంది.

తగ్గాల్సిందే

హైపర్ టెన్షన్ కు ఆహారానికే సంబంధం ఉంటే, హైపన్షన్ వల్ల రక్తప్రసరణ, గుండెపోటు సమస్యలను పెంచే అదనపు కారణాలు కూడా శరీరంలో ఉంటాయి. అవన్నీ కలిసి హఠాత్తుగా గుండె, మెదడుని స్తంభింపజేస్తాయి. ఈ ప్రాణాపాయస్థితి ముందస్తుగా ఏ లక్షణాలూ లేకుండా వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండటమే దీనికి సరైన మందు హైపర్ టెన్షన్. టెన్షన్ వున్నవాళ్లు, ఈ రెండూ రాకూడదనుకునే వాళ్లూ ఉప్పు, వేగించిన ఆహారం, కొవ్వు పదార్థాలు పంచదార ఉన్న ఆహారం, నూనెలు, గుడ్లు, మాంసం, కొప్పులు నూనె గింజలు కాఫీలు, నెమ్మదిగా తగ్గించాలి. ఆల్కహాల్, సిగరెట్ మానేయాలి. 

ఆనందమే ఔషధం

ప్రతి ఒక్కరూ కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి. ప్రతి రోజూ శారీరక శ్రమ కోసం ఏదయినా ఇంటి పనిని ఎంచుకోవాలి. సాధ్యం కాకపోతే యోగ, మెడిటేషన్, వ్యాయామం, శారీరక శ్రమ చేస్తూ తగ్గించుకోవచ్చు. నడక, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఆటలు, వ్యాయామాల్లో ఏది కుదిరితే దానికి గంట సేపు సమయం కేటాయించాలి.. ఎక్కువగా నిద్ర పోవాలి. వీటితోపాటు మానసిక ఒత్తిడికి గురిచేసే పనులకు, చర్చలకు దూరంగా ఉండాలి. ఎత్తుకు తగిన బరుపు ఉండేలా చూసుకోవాలి..

జీవితాన్ని మార్చుకోండి

మానసిక ఒత్తిడి వల్లే అత్యధికుల్లో అధిక రక్తపోటు పెరుగుతోంది. మానసిక ఒత్తిడి ఉద్యోగాలు చేసే పట్టణ ప్రాంత ప్రజల్లోనే కాదు గ్రామీణుల్లోనూ ఈ సమస్య పెరిగిపోతోంది. దేశ ప్రజలకు ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక రోగాల్లో తీవ్రమైనది హైపర్ టెన్షన్ మన దేశంలో హార్ట్ ఎటాక్ కేసుల్లో 24 శాతం హైపర్ టెన్షన్ వల్లనే వస్తున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు హైపర్ టెన్షన్ సమస్యతో ఉన్నారు. అందుకే నాకేం కాదులే అనుకోవద్దు. పెద్దవాళ్లతోపాటు అన్ని వయసుల వారూ  అప్పుడప్పుడూ బీపీ పరీక్ష చేయించు కోవాలి. దీనిని అవగాహనతోనే అధిగమించాలి.. మానసిక ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా. సంతోషంగా ఉంటే హైపర్ టెన్షన్ ఎప్పటికీ రాదు. అందుకోసం ఆహారంలోనే కాదు జీవన శైలిలోనూ మార్పులుండాలి.

రోజూ తినండి..

ప్రతిరోజూ  భోజనంలో కూరలు ఎక్కువుగా తినాలి. భోజనానికి, భోజనానికి మధ్య ఫ్రూట్ సలాడ్స్, పండ్ల రసాలు తీసుకోవాలి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి..

-వెలుగు, లైఫ్-