శ్రీచైతన్య స్కూల్​లో స్టూడెంట్లను చేర్పించవద్దు

శ్రీచైతన్య స్కూల్​లో  స్టూడెంట్లను చేర్పించవద్దు

మక్తల్, వెలుగు: పట్టణంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్​లో తమ పిల్లలను చేర్పించవద్దని పీడీఎస్​యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్​ పేరెంట్స్​ను కోరారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్​బీ గెస్ట్​హౌస్​లో విద్యార్థి, యువజన, ప్రజా, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్​ నిర్వహించారు. 

అనుమతులు లేకుండా స్కూల్​ నిర్వహిస్తున్నారని, జిల్లా అధికారులు స్కూల్​ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్దిలేటి, హైమావతి, వెంకటస్వామి, భగవంతు, పృథ్వీరాజ్, అజయ్, నగేశ్, విజయ్, కల్యాణ్​రాజ్, అజయ్, శేఖర్, రమేశ్​ పాల్గొన్నారు.