-
హర్యానా రిజల్ట్స్ పై ఎంపీ కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితం వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దానిపై సమీక్షించుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈమేరకు బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘మాకు మద్దతు ఇచ్చిన హర్యానా ప్రజలు, కష్టపడి పని చేసిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సత్యం కోసం మేం పోరాడుతూనే ఉంటాం. మీ గొంతుకను వినిపిస్తూనే ఉంటాం” అని అందులో పేర్కొన్నారు. ఫలితాలపై అనేక నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, వాటిని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ‘‘జమ్మూకాశ్మీర్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఇండియా కూటమి సాధించిన విజయం.. రాజ్యాంగం సాధించిన విజయం, ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.