- సంక్రాంతి వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సూచన
హైదరాబాద్సిటీ, వెలుగు: సంక్రాంతి సందర్భంగా రైల్వే ట్రాకుల వద్ద పతంగులు ఎగురేయొద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్వే ప్రాంగణాల్లోని యార్డులు, రైల్వే గేట్లు, ట్రాకుల సమీపంలో ఉన్న కరెంట్తీగల వద్ద పతంగులు ఎగరేసి గతంలో చాలా మంది చనిపోయారని తెలిపారు. రైల్వేలోని ఓవర్‌హెడ్ లైన్లు అధిక వోల్టేజీతో చార్జ్ చేయబడి ఉంటాయని, కరెంట్తీగల దగ్గర గాలిపటాలు ఎగురేస్తే వైర్లకు దారాలు తాకి హై వోల్జేజీ కరెంట్షాక్కు గురవుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా మాంజా, గాలి పటాల దారాలు విద్యుత్ వాహకంగా పనిచయడంతో త్వరగా షాక్ కు గురవుతుంటారని వెల్లడించారు.