ఎక్స్​టెన్షన్లు ఇవ్వొద్దు

  • జలసౌధలో ఇంజనీరింగ్​అధికారుల నిరసన

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో ఎక్స్​టెన్షన్లు ఇవ్వొద్దని ఇంజనీరింగ్​ అధికారులు డిమాండ్​ చేశారు. ఎక్స్​టెన్షన్లతో  అర్హత కలిగిన అధికారులకు అన్యాయం జరుగుతున్నదని వాపోయారు. మంగళవారం జలసౌధలో మధ్యాహ్నం లంచ్​ బ్రేక్​లో ఏటీఏఈఈ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ‘ఎక్స్​టెన్షన్​ వద్దు.. ప్రమోషన్లు ముద్దు’ పేరిట నిరసన  చేపట్టారు. వీరికి టీజీవో సెంట్రల్​ అసోసియేషన్​ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఈఎన్​సీ అనిల్​ కుమార్, ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జాకు వినతిపత్రం ఇచ్చారు. డిపార్ట్​మెంట్​లో ఒక చీఫ్​ ఇంజనీర్​కు ఎక్స్​టెన్షన్​ ఇస్తే ఆరుగురు అధికారుల ప్రమోషన్లను అడ్డుకున్నట్టేనని, డిపార్ట్​మెంట్​లో ఎక్కువ కాలం పనిచేసిన 200 మంది అధికారులు ప్రమోషన్లు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని సెక్రటరీ రాహుల్​ బొజ్జా హామీ ఇచ్చినట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో సెంట్రల్​ అసోసియేషన్​ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, జనరల్​ సెక్రటరీ సత్యనారాయణ, అసోసియేట్​ ప్రెసిడెంట్​ శ్యామ్, ఏటీఏఈఈ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, జనరల్​ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.