
డిఫరెంట్ కథా చిత్రాలతో ఎప్పుడు ముందుంటాడు హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony).బిచ్చగాడు మూవీతో తెలుగు,తమిళ భాషల్లో మంచి హిట్ అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక రీసెంట్ గా (ఏప్రిల్ 11న) రిలీజైనా రోమియో మూవీ..ఇదే తెలుగులో లవ్ గురు.
ఇదిలా ఉండగా తమ చిత్రాన్ని ఉద్దేశించి నెగెటివ్ రివ్యూలు చెప్పిన వారిపై హీరో విజయ్ ఆంటోనీ అసహనం వ్యక్తం చేస్తూ తన X ఖాతాలో పోస్ట్ పెట్టాడు.
"సినిమా గురించి అన్నీ తమకే తెలుసనుకునే చాలామంది మేధావులు..గొప్ప కథలతో తెరకెక్కిన చాలా చిత్రాలను తమదైన శైలిలో విమర్శిస్తున్నారు.ఇక అలాంటి వారి మాటలతో సినిమాపై వెంటనే ఒక నమ్మకానికి రాకండి. తప్పకుండా ‘రోమియో’మూవీని దగ్గరలోని థియేటర్‌లో చూడండి. దయచేసి మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’లా చేయొద్దు’’ అని విజయ్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ సుందర్ తెరకెక్కించిన చిత్రం ‘అన్బే శివం’. ఈ మూవీ మనసుని హత్తుకునే కథతో తెరకెక్కిన కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. దీంతో తమ మూవీని కూడా నెగిటివ్ ఫీలింగ్ తో చూడకండి అనే ఉద్దేశ్యంతో విజయ్ పోస్ట్ చేయగా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సపోర్టివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
లవ్ గురు ఓటీటీ
విజయ్ ఆంటోనీ లవ్ గురు త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.మే 3 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అయితే,ఈ మూవీ తమిళంలో రోమియో టైటిల్ తో రిలీజైంది. తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.
తెలుగులో మాత్రం ఆహా ఓటీటీ, తమిళంలో అమెజాన్ ప్రైమ్‌లో మే 3న ఈ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. త్వరలో లవ్ గురు ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రోమియో కథేంటంటే:
అరవింద్ (విజయ్ ఆంటోని) మలేసియాలో కేఫ్ నడుపుతుంటాడు. అతన్ని తన చెల్లికి సంబంధించిన ఓ చేదు గతం ఎప్పుడు వెంటాడుతుంటుంది. అలాగే మరోవైపు ఆర్థిక సమస్యల నుంచి ఇంటిని గట్టేక్కించే క్రమంలో వృత్తిలో పడి వ్యక్తిగత జీవితాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తాడు. అలా 35ఏళ్ల వయసొచ్చినా కూడా ప్రేమ, పెళ్లి అనే ఫీలింగ్స్ నోచుకోలేకపోతాడు. అయితే ఎంతటి సింగిల్ జీవితానికి అయిన పెళ్లి అవసరం అని గ్రహించి..ఇక బ్యాచిలర్ లైఫ్ కి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో మలేసియా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అరవింద్..లీల (మృణాళిని రవి)ని చూసి సడెన్ గా మనసు పారేసుకుంటాడు. ఇక లీలా మాత్రం సినిమా హీరోయిన్ కావాలని తరుచూ కలలు కంటుంది. ఆమె ఇష్టాన్ని అంగీకరించని ఇంట్లో వాళ్లు అరవింద్‌కు ఇచ్చి పెళ్లి చేస్తారు.అరవింద్ తన భార్య మనసు గెలుచుకునేందుకు చివరికి ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న చెల్లికి సంబంధించిన చేదు గతమేంటి? హీరోయిన్ అవ్వాలన్న లీలా లక్ష్యం చివరికి నెరవేరిందా? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
— vijayantony (@vijayantony) April 20, 2024