ఢిల్లీ సెక్రటేరియెట్ నుంచి ఫైళ్లు, పత్రాలు తరలించొద్దు.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు

ఢిల్లీ సెక్రటేరియెట్ నుంచి ఫైళ్లు, పత్రాలు తరలించొద్దు.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో ముందస్తు అనుమతి లేకుండా సెక్రటేరియెట్ నుంచి ఫైళ్లు, పత్రాలు, కంప్యూటర్లను తరలించొద్దని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఎడీ) ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఓ ఉత్తర్వును జారీ చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా సూచనల మేరకు జీఎడీ ఈ ఉత్తర్వును వెలువరించింది. 

ఈ ఆదేశాలు అన్ని శాఖలు, ఏజెన్సీలు, మంత్రుల క్యాంప్ కార్యాలయాలకు వర్తిస్తాయని చెప్పింది. అన్ని శాఖాధిపతులు, ఇన్​చార్జులు ఈ ఉత్తర్వులు పాటించాలని కోరింది. గతంలో మాదిరిగానే సెక్రటేరియెట్ సాధారణంగానే పని చేస్తోందని ఇక్కడి కార్యాలయాల నుంచి అధికారిక పత్రాలు, ఫైళ్లు, రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇతర వస్తువులను ఎవరూ తరలించకుండా చూసుకోవడం జరుగుతుందని సమాచార, 
ప్రచార డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.