వాటర్​బోర్డు భూమి కబ్జా కాలే

వాటర్​బోర్డు భూమి కబ్జా కాలే

హైదరాబాద్​సిటీ, వెలుగు: అత్తాపూర్ లోని వాటర్​బోర్డు భూమి కబ్జా కాలేదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. మంగళవారం పలువురు అధికారులు, పోలీసులు సదరు స్థలాన్ని పరిశీలించారు. 2006లో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించడానికి ప్రభుత్వం 24.20 ఎకరాలను బోర్డుకు కేటాయించగా, 23, 51 ఎంఎల్డీల కెపాసిటీతో రెండు ఎస్టీపీలను నిర్మించారు. తాజాగా 64, 40 ఎంఎల్డీల కెపాసిటీతో మరో 2 కొత్త ఎస్టీపీలు కడుతున్నారు. వీటి నిర్మాణ సమయంలో కొంత మంది స్థానికులు కబ్జా చేయడానికి ప్రయత్నించగా అడ్డుకుని సర్వే చేసి సరిహద్దుల్ని ఏర్పాటు చేయించారు. భూమి మొత్తానికి కాంపౌండ్ వాల్ నిర్మించామని అధికారులు తెలిపారు.