- సాక్షులను ప్రభావితం చేస్తడు.. నాంపల్లి కోర్టులో ప్రభుత్వం వాదనలు
- మహిళ చావుకు ఆయన ప్రత్యక్ష కారణం కాదన్న డిఫెన్స్లాయర్
హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు అల్లు అర్జున్‌కు బెయిల్ఇవ్వొద్దని, ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం వాదించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి రెండో అదనపు మెట్రో పాలిటన్సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించగా.. సోమవారం వాదనలు కొనసాగాయి. జడ్జి వినోద్కుమార్వాదనలు విన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్మంజూరు చేసింది. రెగ్యులర్బెయిల్కోసం నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్పెట్టుకున్నారు. దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ ఫైల్‌చేశారు. సోమవారం ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య వాద ప్రతివాదనలు నడిచాయి.
పర్మిషన్ ఇవ్వని విషయమూ తెలియదు..
అల్లు అర్జున్‌పై సెక్షన్ 105, 118(1), రెడ్‌విత్ 3(5) బీఎన్‌ఎస్ కింద కేసులు నమోదు చేశారని, అసలు 105 సెక్షన్ ఆయనకు వర్తించదని, బెయిల్మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్నిరంజన్రెడ్డి వాదించారు. ‘‘ఒకరు.. మరొకరి చావుకు డైరెక్ట్‌గా కారణమైనప్పుడు మాత్రమే బీఎన్ఎస్సెక్షన్ పెట్టాలి. అల్లు అర్జున్కేసులో ఇది వర్తించదు. ఘటన జరిగినప్పుడు.. జరిగిన చోటుకు అల్లు అర్జున్ సుమారు 40 అడుగల దూరంలో ఉన్నారు. ఓ మహిళ చనిపోయిందని, బాలుడు గాయపడ్డాడన్న సంగతి కూడా ఆయనకు తెలియదు” అని అన్నారు. అసలు పర్మిషన్ఇవ్వని విషయం కూడా అల్లు అర్జున్‌కు తెలియదని పేర్కొన్నారు. ఇది వరకే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని.. ఏ3, ఏ9, ఏ10కు కూడా కోర్టు బెయిల్ఇచ్చిందని తెలిపారు. ఇన్వెస్టిగేషన్కూడా పూర్తయిందని, అన్ని అంశాలు పరిశీలించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే అర్జున్ విచారణకు తప్పకుండా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు: పీపీ
అర్జున్ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. ఆయనకు బెయిల్ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ వాదనలు వినిపించారు. పోలీస్స్టేషన్లోనూ విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు బెయిల్ఇస్తే మళ్లీ విచారణకు సహకరించే అవకాశం ఉండదన్నారు. ఇన్వెస్టిగేషన్పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జనవరి 3కు తీర్పును వాయిదా వేసింది.