మధుమేహం ( షుగర్) వ్యాధి వచ్చిందని తెలిస్తే చాలామంది నోరు కట్టేసుకుంటారు. ఇరుగు పొరుగు వారు కూడా మీరు అది తినవద్దు.. ఇది తినవద్దు అని చెపుతుంటారు. కొంతమంది సొంత వైద్యం చేసుకుంటారు. కాని అలా అస్సలు చేయకూడదు. డాక్టర్ సలహా మేరకు మందులుల వాడాలి.. అంతేకాదు డైట్ కూడా వైద్యులు చెప్పిన విధంగానే తీసుకోవాలి.
సొంత నిర్ణయంతో చేటు
డయాబెటిస్ వస్తే ఇది తిను. అది మానేయి అని ఎవరు పడితే వాళ్లు చెబితే విన్నారో కష్టమే. అంతేకాదు కొన్ని పుస్తకాల్లో చదివి ప్రాక్టీస్ చేస్తరు. ఈ మధ్య సోషల్ మీడియాలో తిరిగే సమాచారాన్ని కూడా సమ్మేవాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. కానీ, ఒకరి శరీరానికి ఎంత శక్తి అవసరమో చేసే పనిని బట్టి, శరీర పరిమాణాన్ని బట్టి నిర్ణయించాలె. అవసరమైన శక్తికి ఏఏ ఆహారం ఎంత తీసుకోవాలో కొన్ని లెక్కలుంటాయి. మీరు చేసే పనేంటి? మీ ఫుడ్ హాబిట్స్, షుగర్ లెవల్స్ ఇవన్నీ చూసి డైటీషియన్ ఏం తినాలో? ఏది తినకూడదో! ఎంత తినాలో? చెబుతరు. ఇంకెవరు చెప్పినా వాటిని పాటించకండి. డయాబెటిస్ వచ్చిన ప్రతి ఒక్కరూ డైటీషియన్ సలహాతో తీసుకోవాల్సిన డైట్ గురించి తెలుసుకోవాలనే కానీ... అందరికీ ఉద్దేశించి రాసిన సలహాలనే పూర్తిగా పాటించొద్దు.
Also Read : షుగర్ టెస్ట్ చేయించుకున్నారా
క్వాలిటీ ఫుడ్.. క్వాంటిటీ మస్ట్
డయాబెటిస్ వస్తే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలె. ఫుడ్ క్వాంటిటీ తగ్గించి, క్వాలిటీ పెంచాలె. క్వాంటిటీ తగ్గితే బరువు తగ్గుతరు. న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ రాకుండా క్వాలిటీ పెంచాలె. కార్బొహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించి, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలె. అన్నానికి బదులు రాగులు. జొన్నలు, యవలు, మిల్లెట్స్ తింటే మంచిది. తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినాలె. కడుపు నిండినట్లు అనిపించేదాకా తినకూడదు. ఆహారంలో ఫ్రూట్స్ పెంచాలె ఇవి కూడా ఎక్కువ తినకూడదు. నేచురల్ షుగర్ (ఫ్రక్టోజ్) ఎక్కువగా ఉండే పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది. కాబట్టి వాటిని పక్కన పెట్టాలి . భోజనానికి, భోజనానికి మధ్యలో స్నాక్స్ (చిరుతిళ్లు) తీసుకోవద్దు.
ఫిట్ నెస్ ఫస్ట్
డయాబెటిస్ పోవాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలె. కష్టమైన పనైనా ఎంచుకోవాలె. అంత పని చేయలేకుంటే ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు చేయాలె. ప్రతి పనికీ బైక్, కార్ వాడకుండా నడవడానికి ట్రై చేయాలె. రోజులో 30 నుంచి 60 నిమిషాలపాటు వ్యాయామం చేయాలె. వర్కవుట్స్ చెమటలు పట్టేంతగా చేయాలె. ముఖ్యంగా కార్డియో వాస్కులర్ పర్కవుట్ చేయాలె. వారంలో అయిదు రోజులు తప్పకుండా వ్యాయామం చేయాలె. చాలా మంది వర్కవుట్స్ స్టార్ట్ చేసిన తర్వాత నెల. మూడు నెలలకే రిజల్ట్ రాలేదని వదిలేస్తున్నరు. కనీసం 6 నెలలు కష్టపడితేనే రిజల్ట్ కనిపిస్తది.
–వెలుగు,లైఫ్–