మగాళ్లకు ప్రత్యేకం : నవంబర్ నెల.. నో షేవ్.. నో క్లీన్.. గడ్డం తీయకండి..!

మగాళ్లకు ప్రత్యేకం : నవంబర్ నెల.. నో షేవ్.. నో క్లీన్.. గడ్డం తీయకండి..!

నవంబర్ అనగానే ఎవరికి ఏది గుర్తొచ్చినా.. మగవాళ్లకు మాత్రం గడ్డం గుర్తొస్తుంది. ఎందుకంటే నవంబర్ నెలకు మగవాళ్లు పెట్టుకున్న ముద్దు పేరు  నో షేవ్.... నవంబర్. అందులోనూ ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులకు ఈ నెల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ నెలలో చాలామంది మగవాళ్లు షేవ్ చేయకుండా. నెల పొడవునా గడ్డం పెంచి వాట్సాప్ లో పోస్టులు పెడుతుంటారు. అసలు ఇంతకీ ఏంటి ఈ  నో షేవ్ నవంబర్ .. గురించి  ఈ స్టోరీ లో తెలుసుకుందాం.  .

గడ్డం అంటే సచ్చినా, నచ్చకపోయినా ఈ నెలలో మాత్రం షేవింగ్ చెయ్యకూడదు. ఎందుకంటే ఇది నో షేన్ మంత్. గత కొన్నేళ్లుగా బాగా ట్రెండ్ అవుతున్న పాపులర్ ఛాలెంజ్ ఇది. నో షేవ్​ నవంబర్ అంటే.. నవంబర్ నెలలో మగవాళ్లు మీసం, గడ్డం షేవ్ చెయ్యకుండా అలాగే వదిలెయ్యాలి. 'అదేంటి మా స్టెల్ మా ఇష్టం కదా' అంటారా? అయితే ఇది స్టైల్ కోసమో, ఫ్యాషన్ కోసమో పుట్టించినే చాలెంజ్ కాదు. దీనికొక పర్పస్ ఉంది. అదేంటంటే...

 వాళ్ల కోసమే.. 

నవంబర్ నెలలో షేవ్ చేసుకోకుండా ఉంటే.. క్యాన్సర్ బాధితులకు సాయం చేసిన వాళ్లవుతారు. ఎలాగంటే.. మగవాళ్లందరూ ప్రతీ నెల షేవింగ్ కోసం ఎంతో కొంత ఖర్చుపెడుతుంటారు. అయితే ఈ నవంబర్ నెలలో షేవ్​ చేసుకోకుండా ఆ దబ్బుని మిగల్చాలి. ఆ దాచిపెట్టిన డబ్బును క్యాన్సర్ పేషేంట్స్​ కి డొనేట్ చేయాలి. ఇది "నో షేవ్ నవంబర్' కాన్సెప్ట్. ఈ చాలెంజ్ ఆన్లైన్లో చాలా పాపులర్ అయింది.  ఒక పక్క ఫ్యాషన్​ గాను, మరోపక్క మంచి ఉద్దేశంతోనూ ఉండడంతో ఈ చాలెంజ్​ లో చాలామంది మగవాళ్లు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ ప్రపంచమంతా ఫాలో అవుతుంది. ఈ నెలలో సోషల్ మీడియా అంతా గడ్డం ఫొటోలతో నిండిపోతుంది.

సింబాలిక్ సపోర్ట్

ప్రతీ నెల మగవాళ్లు షేవింగ్ కోసం బాగానే ఖర్చు చేస్తుంటారు. ప్రపంచంలో సెలూన్స్, మెన్స్ బ్యూటీ పార్లర్ల ఆదాయం కోట్లలోనే ఉంది. ఇంత మొత్తాన్ని ఈ నెలంతా ఖర్చుచేయకుండా దాచిపెట్టండి' అని అమెరికాకు చెందిన సెయింట్ జాడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లోని చారిటీ సంస్థ పిలుపునిచ్చింది. నో షేవ్ తో దాచిన డబ్బుని క్యాన్సర్ పేషెంట్లకు డొనేట్ చేయాలని కోరింది. అయితే కేవలం షేవింగ్ తో సేవ్ చేసిన దాన్నే ఎందుకు డొనేట్ చేయాలి' అనేందుకు కూడా ఒక రీజన్ ఉంది. క్యాన్సర్ ట్రీట్​మెంట్​లో తీసుకునే థెరపీలు, రేడియేషన్ల వల్ల క్యాన్సర్ పేషెంట్లకు జుట్టు పూర్తిగా ఊడిపోతుంది. అలాంటి వాళ్లకు సింబాలిక్ సపోర్ట్ ఉండేందుకు ఇలా వెంట్రుకలు, గడ్డం తీయకుండా ఉండే చాలెంజ్ క్రియేట్ చేశారు. నో షేవ్ తో దాచిన మొత్తాన్ని "నోషేవ్ డాట్ ఓఆర్ జీ (noshave.org)' వెబ్ సైట్ ద్వారా డొనేట్ చేయెచ్చు.

అందంగామా..

గడ్డం పెంచితే బాగోదని ఒకప్పుడు ఫీలయ్యేవాళ్లు. కానీ కొన్నేళ్లుగా గడ్డం స్టైల్ బాగా ట్రెండ్ అవుతోంది. యూత్ రకరకాల స్టయిల్స్ లో గడ్డం పెంచుతూ మరింత ట్రెండీగా మారుతున్నారు. ఒకప్పుడు క్లీన్ షేవ్ ఇష్టడిన వాళ్లు కూడా ఇప్పుడు గడ్డం పెంచడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఫ్యాషన్ డిజైనర్లు, స్టైలిస్టులు కూడా గడ్డంలో రకరకాల స్టైల్స్ డిజైన్ చేస్తున్నారు. గడ్డం ఉంటే మ్యాన్లీగా కనిపిస్తారని, జా లైన్ అందంగా కనిపిస్తుందని కూడా డిజైనర్లు చెప్తున్నారు. అందుకే యూత్ కొత్తకొత్త బియర్డ్ స్టైల్స్ కనిపిస్తున్నారు..

ఆరోగ్యం కూడా...

గడ్డం వల్ల అందమే కాదు ఆరోగ్యంగానూ ఉండొచ్చని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. సూర్యకిరణాల ద్వారా వచ్చే అల్ట్రావయొలెట్ కిరణాలు ముఖంపై పడకుండా గడ్డం అడ్డుకుంటున్నట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే ఆస్తమా, డస్ట్ అలర్జీతో బాధపడే వాళ్లకి కూడా గడ్డం ఉపయోగ పడుతుంది. దుమ్ము, ధూళి ముఖంపై చర్మానికి తగలకుండా ఫిల్టర్ పనిచేస్తుంది. బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు రెగ్యులర్​గా షేవింగ్ చేసే వాళ్లతో పోలిస్తే గడ్డం పెంచే వారిలో తక్కువగా వస్తాయని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి.

జాగ్రత్తగా ఉంటేనే..

'నో షేప్ నవంబర్' కి రెడీ అయిన వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెల రోజుల పాటు 'నో షేవ్' అంటే అంత ఈజీ కాదు. గడ్డం.. గడ్డిలా పిచ్చిపిచ్చిగా పెరగకుండా వారానికి ఓ సారైనా మైల్డ్ షాంపూ, కండీషనర్ లాంటివి వాడాలి. అలాగే పెరిగిన గడ్డాన్ని దువ్వుకోవడం, గడ్డం అందంగా కనిపించేందుకు యూకలిప్టస్​ ఆయిల్​ రాసుకోవడం  కూడా మంచిదే. గడ్డం మరీ ఇబ్బందిగా మారి ... చికాకు తెప్పిస్తే ట్రిమ్ చేసి కొంతవరకూ తగ్గించుకోవచ్చు.

-వెలుగు,లైఫ్​–