రైతులు, సైనికుల సమస్యలను ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నయి :బీజేకేపీ రాష్ట్ర అధ్యక్షుడు గండే సురేంద్రనాథ్

రైతులు, సైనికుల సమస్యలను ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నయి :బీజేకేపీ రాష్ట్ర అధ్యక్షుడు గండే సురేంద్రనాథ్
బషీర్​బాగ్​, వెలుగు: రైతులు, సైనికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ(బీజేకేపీ) రాష్ట్ర అధ్యక్షుడు గండే సురేంద్రనాథ్ మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించడానికి జై జవాన్ జై కిసాన్ నినాదంతో బీజేకేపీ అవతరించిందన్నారు. 

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాయణ ప్రభాకర్ అంకుశ్, జాతీయ సమన్వయ కర్త సుదర్జీ మోహన రావు హాజరయ్యారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అరికట్టడం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు. దేశం కోసం పోరాడిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అందరూ ఏకం కావాలన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలోనే జిల్లా పర్యటనలు చేపడతామని తెలిపారు.