Nani Odela 2: దయచేసి ఆపండి..ఆ రూమర్స్ ప్రేక్షకుల ఎగ్జైట్‍మెంట్ చంపేస్తాయి..నాని మూవీ టీం సీరియస్

నేచురల్ స్టార్ నాని (Nani)  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టేసి మస్త్ జోష్ లో ఉన్నారు. గతేడాది దసరా, హాయ్ నాన్న తాజాగా ‘సరిపోదా శనివారం’ చిత్రంతో  బ్లాక్‍బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే ఊపులో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తెరకెక్కబోయే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో స్టైలిష్ లుక్, కోరా మీసాలతో నాని కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుండంగా..ఊర మాస్ లెవల్లో బీడీ తాగుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు..అనే ట్యాగ్ తో సినిమా ఏ విధంగా ఉండనుందో అనే అంచనాలు షురూ చేశారు శ్రీకాంత్.

Also Read:-దర్శకులకు చిరంజీవి ఛాలెంజ్

అయితే, ఈ చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వస్తున్నాయి. కథ ఇదేనని, మూవీ ఇలా ఉంటుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ సోమవారం (సెప్టెంబర్ 2) స్పందించింది.

“నానిఓదెల్ 2 ప్రాజెక్ట్ మాకు చాలా ప్రతిష్టాత్మకమైనది. అలాగే ఇండియన్ సినిమాలో మోస్ట్ యాంటిసిపేటెడ్‍గా ఉంటుంది. ఇలాంటి చిత్రంపై రూమర్లు, లీక్‍లు వస్తుండటం చాలా బాధగా అనిపిస్తోంది. ఇలాంటివి సినిమాపై ఎగ్జైట్‍మెంట్ చంపేస్తాయి” అని మూవీ టీమ్ స్పెషల్ నోట్ పోస్ట్ చేసింది.

అలాగే ఈ సినిమాపై ఫేక్ న్యూస్‍, రూమర్లు, లీక్‍లను ఎవరూ వ్యాప్తి చేయవద్దని కోరింది. అనధికారింగా ఇప్పటి వరకు బయటికి వచ్చిన సమాచారంలో ఏ మాత్రం నిజం లేదని మూవీ టీమ్ తెలిపింది. తమ నుంచి ఈ చిత్రంపై త్వరలో అప్‍డేట్స్ వస్తాయని స్పష్టం చేసింది.

ఈ మూవీ నాని కెరియర్ లో 33వ సినిమాగా రాబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ (SLV Cinemas) లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..80 దశకంలో తెలంగాణలోని వ్యవస్థ, ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడు లీడర్ గా ఎలా ఎదిగాడు అనే కథతో  ఈ సినిమా రానుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.