న్యూఢిల్లీ: పిల్లలకు ఏ ఏజ్ లో వేయాల్సిన టీకాలు అదే ఏజ్ లో వేయాలె. కొన్ని టీకాలు ఆరు వారాల వయసులో, కొన్ని 10 వారాలకు, మరికొన్ని 14 వారాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు కరోనా భయంతో పిల్లలకు టీకాలు వేయించేటందుకు పేరెంట్స్ జంకుతున్నారు. దవాఖాన్లకు పోతే చిన్నారులకు వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనని భయపడుతున్నారు. అందుకే.. తాము పిలుస్తున్నా.. పిల్లలకు టీకాలు వేయించకుండా పేరెంట్స్ లేట్ చేస్తూ వస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. వ్యాక్సిన్ లు టైమ్ కు వేయకుండా ఇలా లేట్ చేయడం మంచిది కాదని అంటున్నారు. టైమ్ కు వ్యాక్సిన్ లు వేయకుండా లేట్ చేస్తే.. భవిష్యత్తులో పిల్లల హెల్త్ పై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు పుట్టిన ఏడాదిలోపు కచ్చితంగా టైమ్ ప్రకారం వ్యాక్సిన్లు వేయించాలని స్పష్టం చేస్తున్నారు.
నెలకు మించి లేట్ చేయొద్దు..
‘‘నా దగ్గరికి ఓ వ్యక్తి తన బిడ్డకు పోలియో వ్యాక్సిన్ చేయించడానికి తీసుకొచ్చాడు. వాస్తవానికి ఆ బిడ్డకు 3 నెలల ముందే టీకా వేయాలి, కరోనా వల్ల లేట్ చేశారు. వ్యాక్సిన్లు లేట్ చేయడం మంచిది కా దు. రోటావైరస్ వ్యాక్సిన్ వేసేందుకు లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది. చివరి డోస్ కచ్చితంగా 7 నెలలకు వేయాలి’’ అని ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్ డాక్టర్ రాహుల్ నాగ్ పాల్ చెప్పారు. సిటీలోని మెడియోర్ హాస్పిటల్ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ మొదటి 3 నెలల్లో కరోనా భయంతో పేషెం ట్లు చాలా తక్కువగా వచ్చారని చెప్పారు. కానీ ఇప్పటికీ పేరెంట్స్ తమ పిల్లలను తీసుకొచ్చి టీకాలు వేయించేందుకు జంకుతున్నారన్నారు. టీకాలను టైమ్ ప్రకారమే వేయాలని, ఒక వారంపాటు వాయిదా వేయొచ్చన్నారు. పిల్లలు రెండో ఏడాదిలో ఉంటే.. ఒకటి, రెండు నెలలకు మించి లేట్ చేయొద్దని సూచించారు.
For More News..