మళ్లీ కేసులు పెరగటంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లో కరోనా కంట్రోల్ లోనే ఉందని…ప్రజలు పానిక్ కావాల్సిన అవసరం లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 5 రోజులుగా ఢిల్లీలో రోజుకు 2 వేల పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన మొదలైంది. దీంతో శనివారం ఆన్ లైన్ లో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ” కరోనా పై ఢిల్లీ వార్ ప్రకటించింది. మార్కెట్లు, బస్టాండ్ లలో మొహల్లా క్లినిక్ ఏర్పాటు చేసి టెస్టులు చేస్తున్నాం. కరోనా టెస్టులు డబుల్ చేయటంతోనే కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా మరణాలను తగ్గించేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టాం. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని మీడియా తో అన్నారు. ఢిల్లీలో 14 వేల బెడ్స్ ఉంటే 5 వేల బెడ్స్ మాత్రమే వినియోగిస్తున్నాం. ఇందులోనూ 1700 ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చామని చెప్పారు. బెడ్స్, ఐసోలేషన్ సెంటర్లు, ట్రీట్ మెంట్, మెడిసిన్ కు కొరత లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
For More News..