మన సైంటిస్టుల పనితనాన్ని అనుమానించొద్దు

‘ఆగస్టు 15 లోపు కరోనా వ్యాక్సిన్’ ప్రకటనపై ఐసీఎంఆర్ క్లారిటీ
గ్లోబల్ ప్రాక్టీస్ కు అనుగుణంగా వ్యాక్సిన్ ప్రక్రియ

న్యూఢిల్లీ: ఆగస్ట్15 లోపు కరోనా వ్యాక్సిన్‌‌‌‌ను తీసుకొస్తామని ఐసీఎంఆర్ ప్రకటించడంతో అన్నివైపుల నుంచి ఆశ్చర్యాలు, అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. అంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ తేవడం ఎలా అన్న ప్రశ్నలు వచ్చాయి. కేవలం ట్రయల్స్ కే కొన్ని నెలలు పడుతుందని, అలాంటిది నెలన్నర రోజుల్లో టీకాను ప్రజలకు అందుబాటులో ఎలా ఉంచుతారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ శనివారం స్పందించింది. తమ ప్రకటనపై వివరణ ఇచ్చింది. రెడ్ టీపిజాన్ని (అకారణంగా జరిగే జాప్యాన్ని) కట్ చేసేందుకు, గ్లోబల్ ప్రాక్టీస్ కు అనుగుణంగా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించామని చెప్పింది. ‘‘కామెంటేటర్ల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాకుకు వెల్కమ్. కానీ మన గొప్ప మెడికల్ ప్రొఫెషనల్స్, సైంటిస్టుల ఫ్రొఫెషనలిజాన్ని, నిబద్ధతను అనుమానించొద్దు” అని కోరింది.

వాటి మాదిరే..
‘‘క్లినిక్లికల్ ట్రయల్స్ చేస్తున్న ఇన్వెస్టిగేటర్లకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ లెటర్ రాశారు. వ్యాక్సిన్ తీసుకురావడంలో అనవసర జాప్యాన్ని నివారిస్తూ.. అలాగే అవసరమైన ప్రక్రియను దాటవేయకుండా.. పార్టిసిపెంట్ల రిక్రూట్మెంట్ను వేగవంతం చేయాలని ఆ లెటర్కు అర్థం’’ అని ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తె లిపింది. ‘‘కొత్తగా తయారు చేసిన స్వదేశీ టెస్టింగ్ కిట్లను వేగంగా అప్రూవ్ చేసేందుకు లేదా కరోనాకు సంబంధించిన డ్రగ్స్ను ప్రవేశపెట్టేందుకు ‘రెడ్ టేపిజం’ అడ్డంకి కావద్దని భావించాం. అందుకే అవి త్వరగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు దేశీయ వ్యాక్సి న్ అభివృద్ధి ప్రక్రియ కూడా లేట్ కాకూడదని ఇలా చేశాం..” అని వివరించింది. ‘‘వ్యాక్సిన్ వస్తే.. దాని సమర్థతను తెలుసుకునేందుకు జనాభా ఆధారిత ట్రయల్స్ ను ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రారంభించవచ్చు. వ్యాక్సిన్ డెవలప్ మెంట్ దశలను త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యానికి ఇదే కారణం” అని చెప్పింది.

ప్రజల భద్రతే టాప్ ప్రయారిటీ
ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ కలిసి దేశీయ కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ను డెవలప్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన రూల్స్ ఆధారంగానే వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేశామని ఐసీఎంఆర్ చెప్పింది. దేశ ప్రజల భద్రతే ఐసీఎంఆర్ కు టాప్ ప్రయారిటీ అని, ఇందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. ‘‘ఇప్పటికే అన్నిప్రీ క్లినికల్ స్టడీస్ ను పూర్తి చేశాం. ఫేజ్1, ఫేజ్2 హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉంది” అని తెలిపింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాక్సిన్లు పలు దశల్లో ఉన్నాయి. దేశీయ వ్యాక్సిన్ డెవలప్మెంట్ను ప్రమోట్ చేయడం ముఖ్యం. ఇదే సమయంలో సేఫ్టే, క్వాలిటీ, ఎథిక్స్, నిబద్ధత, అన్ని రెగ్యులేటర్ అవసరాలకు కట్టుబడి ఉండాలి” అని వివరించింది.

For More News..

కరోనా భయంతో హుస్సేన్ సాగర్లో దూకిండు

కరోనా డేంజర్లో హైదరాబాద్

ప్రైవేటు ల్యాబుల్లో తప్పుడు రిజల్ట్స్