భారత్‌లో తయారై ఇరాక్‌లో అమ్ముతున్న మరో నాసిరకం సిరప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ జలుబు సిరప్ కోల్డ్ అవుట్ సురక్షితం కాదని హెచ్చరించింది. గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన మెడికల్ అలర్ట్‌లోఈ విషయాన్ని తెలిపింది. ఈ సిరప్ ను చెన్నైకి చెందిన ఫోర్ట్స్ లాబొరేటరీస్ తయారు చేయగా, ఇరాక్ లో ఎక్కువగా వినియోగంలో ఉందని తెలిపింది.
ఇది సురక్షితం కాదని, పిల్లలు దీనిని వాడితే అనారోగ్యానికి గురవుతారని, ఒక్కోసారి మరణం కూడా సంభవించునని హెచ్చరించింది. కోల్డ్ అవుట్ సిరప్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించగా ఇందులో డైథైలీన్ గ్లైకాల్ (0.25%) మరియు ఇథిలీన్ గ్లైకాల్ (2.1%) కలుషితాలు ఉన్నట్లుగా గుర్తించామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇది వినియోగించాల్సిన శాతం కంటే 0.10% కంటే అధికంగా ఉన్నట్లు తెలిపింది.
అయితే ఇప్పటివరకు ఇరాక్ అధికారులు కోల్డ్ అవుట్‌కు సంబంధించిన ఎటువంటి కంప్లైట్స్ చేయలేదు. కాగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో పిల్లల మరణాలకు భారత్ తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.