అరిటాకుల్లో అన్నం.. మట్టి గ్లాసుల్లో నీళ్లు

అరిటాకుల్లో అన్నం.. మట్టి గ్లాసుల్లో నీళ్లు
  •  ఖమ్మం జిల్లాలో వినూత్నంగా పెండ్లి చేసుకున్న పంచాయతీ కార్యదర్శి 

ఖమ్మం రూరల్​, వెలుగు :  ప్రస్తుత కాలంలో ఫంక్షన్ల ఏదైనా ప్లాస్టిక్​ వాడకం తప్పనిసరైంది. ఖమ్మం జిల్లాలో ఒక పెండ్లిలో పూర్తిగా ప్లాస్టిక్ ​నిషేధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం పంచాయతీ కార్యదర్శి ఈదగాని సంపత్​ తన పెండ్లిని ఆదివారం ఖమ్మం రూరల్ పరిధిలోని మారెమ్మ టెంపుల్ వద్ద  ఫంక్షన్ ​హాల్​లో చేసుకున్నాడు. 

ఈ పెండ్లి తంతులో ఎలాంటి ప్లాస్టిక్ ​వస్తువు వాడలేదు.  వివాహ స్వాగత బోర్డు నుంచి   పెండ్లి మండపం దాకా అన్ని వస్తువులను ప్లాస్టిక్​ లేకుండా చూశాడు. పూలు, అరటి ఆకులు, మట్టి గ్లాసులు, అల్యూమినియం చైర్లు వినియోగించాడు. ఒక్క ప్లాస్టిక్ ముక్క కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. పెండ్లికి వచ్చిన బంధువులు, అతిథులు ప్లాస్టిక్​ లేకపోవడం చూసి పెండ్లి కొడుకు సంపత్​ను అభినందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చర్చించుకున్నారు.