బ్యాంక్​ అకౌంట్​ నుంచి  డబ్బులు కొట్టేసిన్రు !

  •      రూ. 40 వేలు  కోల్పోయిన బాధితుడు  

నిర్మల్, వెలుగు:  నిర్మల్ లోని  గాంధీ చౌక్ లో మెడికల్  షాప్  నిర్వహించే  గందే వెంకటేశ్వర్  ఖాతా  నుంచి  సైబర్​ నేరగాళ్లు రూ. 40 వేలను కొట్టేశారు.  నాలుగు రోజుల నుంచి ప్రతిరోజూ రూ.10వేల చొప్పున డ్రా అవుతున్నట్టు మెసేజ్​లు రావడంతో  వెంకటేశ్వర్    బ్యాంక్  అధికారులను  కలిశాడు. దీనిపై ఆరా తీసిన బ్యాంక్ అధికారులు ఆధార్ సెంటర్ నుంచి అతడి ఫింగర్ ప్రింట్ ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు.

దీంతో బాధితుడు  నిర్మల్ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. నిందితులు ఆధార్ సెంటర్​లో ఈ వేలిముద్రలు సేకరించినట్టు తెలుస్తోంది.  వెంకటేశ్వర్ తో  పాటు  మరో  పదిమంది ఇలాగే డబ్బు లు కోల్పోయారని సమాచారం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.