ప్రజాస్వామ్యంలో విద్వేషమే కీలక మంత్రమా..?

ప్రజాస్వామ్యంలో విద్వేషమే కీలక మంత్రమా..?
  • ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్న

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ప్రజాస్వామ్యంలో విద్వేషాన్ని కీలక మంత్రంగా చేయాలనుకుంటున్నారా అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీపై హింసను ప్రేరేపించేలా చేస్తున్న ప్రకటనలను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల గొంతును బలంగా వినిపిస్తుండటంతో రాహుల్ పై సైద్ధాంతిక హింస పెరిగిందని తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకర్లతో ఆమె మాట్లాడారు.

‘‘దేశంలోని కోట్లాది మంది దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, పేదల గొంతును బలంగా వినిపించడం నేరమా..? రాహుల్ గాంధీపై బీజేపీ బెదిరింపులకు దిగింది. వరుసగా చేస్తున్న హింసాత్మక, అసభ్యకరమైన ప్రకటనలు ఇది ప్రణాళికాబద్ధమైన ప్రచారం అని  నిరూపిస్తున్నాయి. ఇది దేశ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఈ ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ ఎటువంటి చర్యలు తీసుకోవడం మరింత ప్రమాదకరం. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యంలో హింస, విద్వేషాన్ని కీలక మంత్రంగా చేయాలనుకుంటున్నారా..?” అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.