
ఏదో తెలియని నిస్సహాయత.. ఎందుకో తెలియని బాధ.. చిన్నచిన్న విషయాలకే కన్నీళ్లు.. ఏం చేద్దామన్నా మనసొప్పదు. ఈ మూడ్ స్వింగ్స్ ఏదో ఒక టైంలో అందరికీ అనుభవమే. మరి ఈ ఎమోషన్స్ నుంచి బయటపడాలంటే... సింపుల్ టెక్నిక్స్ కొన్ని ఫాలో అవ్వాలి.
చిరాకుగా ఉన్నప్పుడు నచ్చిన సంగతులు, ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి ఆలోచనల వల్ల కొత్త ఉత్సాహం నిండి మనసు తేలికవుతుంది. పాత ఫొటోలు చూసుకున్నా కూడా రిలాక్స్ అవుతారు.
పిల్లలతో ఆడి, పాడితే ఒత్తిడి క్షణాల్లో ఎగిరిపోతుంది. వాళ్ల బోసి నవ్వులు ఎంతటి కష్టంలో ఉన్నా ముఖంపై నవ్వులు పూయిస్తాయి. మనసుని ఆహ్లాదపరుస్తాయి. వీలైతే పెట్స్‌తో కూడా కాసేపు గడపొచ్చు. పచ్చని చెట్ల మధ్య కాసేపు కూర్చున్నా మైండ్ రిఫ్రెష్ అవుతుంది.
చుక్కమల్లె, గులాబీ, చామంతి, మల్లె, సన్నజాజిలాంటి పూల పరిమళాలు కూడా హ్యాపీ మూడ్‌ని తీసుకొస్తాయ్. మనసు బాగాలేనప్పుడు ఆ ఎమోషన్ని పేపర్‌పై పెట్టినా రిజల్ట్ ఉంటుంది.
మనసు బాగాలేనప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నచ్చిన వాళ్లతో కాసేపు కబుర్లు పెడితే చాలు, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అలాగే కొత్త కొత్త ప్లేస్‌లకి వెళ్లడం.. వెరైటీ వంటకాల్ని రుచిచూడడం లాంటివి చేసినా మైండ్ రిలాక్స్ అవుతుంది. స్వయంగా వంట చేసినా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
ఎక్సర్సైజ్ చేస్తే ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ పన్నెండు గంటల పాటు మనసుని ఉత్సాహంతో నింపుతుంది. ఆ ఎమోషన్స్ వల్ల కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అలాంటప్పుడు నచ్చిన పాట పెట్టుకొని డాన్స్ చేయాలి. అలిసిపోయే వరకు చిందులేస్తే మూడ్ క్షణాల్లో మారిపోతుంది.
అలాగే కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల కూడా రిలీఫ్ గా అనిపిస్తుంది.