చంద్రగ్రహణం అర్దరాత్రి ఏర్పడుతుంది. దాదాపుగా ఆ సమయంలో అందరూ నిద్రపోతుంటారు. ఎవరో కొంతమంది మాత్రమే జపాలు చేస్తూ గ్రహణం వీడిన తరువాత స్నానం చేసి శుద్దవుతారు. గ్రహణం రాత్రి ఏర్పడింది కాబట్టి ఉదయం లేచిన తరువాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు. అంతే కాదు, ఈ కాలంలో దేవుడి విగ్రహాన్ని, పూజకు సంబంధించిన వస్తువులను తాకడం నిషేధం. సూత కాలం నుంచి దేవాలయాల తలుపులు మూసేశారు. గ్రహణం సమయంలో రాహువు ప్రభావం చాలా బలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రతికూల ప్రభావాలు చుట్టుపక్కల వస్తువులపై కూడా ఉంటుందంటున్నారు.
గ్రహణం పట్టిన వెంటనే ఈ పని చేయండి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 28న చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో గ్రహణ సమయంలో నిద్రలేవకపోతే మీరు తెల్లవారుజామున నిద్రలేచినట్లయితే వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మీరు నిద్రలేచిన వెంటనే, ముందుగా ఇంటి మొత్తం ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయాలని చెబుతున్నారు. వీటిని అనుసరించడం ద్వారా, ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేయవచ్చు.
గ్రహణం తర్వాత ఇలా చేయండి..
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం ముగిసిన వెంటనే, సూతకం కూడా ముగుస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లోని ప్రతి మూలలో గంగాజలాన్ని చల్లాలి. మీరు ఈ సమయంలో నిద్రపోతున్నట్లయితే, మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఇలా చేయాలి. ముందుగా ఇంటి ప్రధాన ద్వారాన్ని గంగాజలం చల్లి శుభ్రం చేయాలి. గంగా జలం లేకపోతే నీటితో శుభ్రం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. అలాగే, ప్రతికూలత ఉండే ఇళ్లలో లక్ష్మి ఉండదు అని చెబుతుంటారు. - దీనితో పాటు ఇల్లు, దుకాణాలను శుభ్రంగా కడగాలి. గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని, గ్రహణం ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.
గ్రహణం తర్వాత స్నానం చేయండి.
మీరు స్నానం చేయలేకపోతే గంగాజలం మీపై చల్లుకోండి. స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని చల్లడం మంచిది. - గ్రహణం తర్వాత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ముందుగా దేవుడి గదిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత గంగాజలం చల్లాలి. ఆ తరువాత ఆహార పదార్థాలపై గంగాజలం చల్లి వాటిని శుద్ధి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
గ్రహణం కంటె ముందు సమయంలో తయారుచేసిన ఆహారాన్ని పూర్తిగా పారవేయాలి. గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్ధాలను తినడం ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని పండితులు చెబుతారు. చంద్రగ్రహణం తర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్తగా మళ్లీ తాగునీరు తెచ్చుకోవాలి.గ్రహణం ముగిశాక వెంటనే తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి