న్యూఇయర్ ఇలా స్టార్ట్ ​చేయండి..టార్గెట్స్ ​రీచ్​ అవ్వండి

న్యూఇయర్ ఇలా స్టార్ట్ ​చేయండి..టార్గెట్స్ ​రీచ్​ అవ్వండి

కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం వస్తోంది. న్యూ ఇయర్ ని ఫ్రెష్​ గా  స్టార్ట్ చేయాలని అందరూ అనుకుంటారు. మనల్ని మనం రీసెట్ చేసుకోడానికి న్యూ ఇయర్ లాంటి స్పెషల్ డేస్ ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు. మంచి ఉత్సాహాన్నిస్తాయి. అందుకే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేముందు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే న్యూ ఇయర్ను ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు.

న్యూక్లియర్ కోసం పెద్దపెద్ద రెజల్యూషన్స్ పెట్టుకోవడం మామూలే.. అయితే వాటితో పాటు మొబైల్ లో పనికిరాని యాప్స్ డిలీట్ చేయడం. వంటగదిని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం లాంటి చిన్నచిన్న మార్పులతో ఇయర్ను మరింత కొత్తగా మలుచుకోవచ్చు. అదెలాగంటే..

కొత్త బుక్స్​తో .. 

కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త బుక్స్ కొనడం ద్వారా న్యూ ఇయరు కొత్త ఆలోచనలతో మొదలు పెట్టొచ్చు. అలాగే షెల్ప్ లో చదివేసిన పుస్తకాలు, అవసరం లేని పుస్తకాలు కూడా చాలానే ఉంటాయి. వాటన్నింటిని ఒకసారి రీ చెక్ చేసుకుని పనికొచ్చేవి ఉంచుకుని అవసరంలేనివి ఎవరికైనా ఇచ్చేయొచ్చు. షెల్ప్ లో మంచి పుస్తకాలు ఉంటే వాటిని చూసినప్పుడల్లా కనీసం కొన్ని పేజీలైనా చదవాలనిపిస్తుంది. అలాగే అంతకుముందు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండి ఇప్పుడు మానేసిన వాళ్లు న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ రీస్టార్ట్ చేయొచ్చు.

కాంటాక్ట్స్​లిస్ట్ 

న్యూ ఇయర్ లో చేయాల్సిన మరో ముఖ్యమైన పని.. కాంటాక్ట్ లిస్ట్ను చెక్ చేయడం. ఫోన్లో... రెండు మూడు సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఉన్న కాంటాక్ట్స్ ఎన్నో ఉంటాయి. వీలు చూసుకుని వాటన్నింటినీ డిలీట్ చేయడం బెటర్. అలాగే అందులో మాట్లాడి చాలాకాలం అయిన పాత ఫ్రెండ్స్ కూడా ఉండే ఉంటారు. వాళ్లందరిని ఒకసారి పలకరించడం వల్ల పాత స్నేహాలను ఒకసారి గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది.

ALSO READ | New Year Special : జనవరి ఫస్ట్.. నాన్ వెజ్ పెప్పర్ స్పెషల్ వంటకాలు.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ ఫుడ్ తయారీ ఇలా..!

జంక్ మెయిల్స్ 

చాలామంది మొబైల్స్ లో డజన్ల కొద్దీ పనికిరాని మెయిల్స్ వస్తుంటాయి. మనం సబ్స్క్రి ట్ చేయకపోయినా వాటంతటనే మెయిల్ లిస్టులో వచ్చి చేరుతుంటాయి. వీటి వల్ల ఏది ఇంపార్టెంట్ మెయిల్, ఏది కాదో అర్థమవడానికి టైం పడుతుంది. అందుకే కాస్త తీరిక చేసుకుని అనవసరమైన మెయిల్స్ అన్నింటినీ అన్​ సబ్​స్క్రైబ్​చేస్తే అచ్చంగా మనకు పనికొచ్చే మెయిల్స్ నే మెయిల్ టెక్ట్స్​లో చూసుకోవచ్చు.

కిచెన్ శుభ్రంగా.. 

కిచెన్​ శుభ్రంగా ఉంటే ఇంట్లో మూడ్ బాగుంటుంది. పైగా హెల్దీ కూడా. అందుకే న్యూ ఇయర్ కి ఒక రోజు ముందైనా ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే బెటర్. ముఖ్యంగా కిచెన్. 

వంటగదిలోని ప్రతీ మూల నీట్​గా ఉంచుకోవడం వల్ల చాలావరకూ హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే కొత్తకొత్త వంటలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది.

అందమైన ఇంట్లో.. 

న్యూ ఇయర్ స్పెషల్ గా ఒకసారి ఇల్లంతా నీట్ గా డెకరేట్ చేస్తే.. ఇంట్లో కొత్త ఉత్సాహం. వస్తుంది. కాస్త సమయం కేటాయించి వార్జ్ రోబ్, హాల్, బెడ్రూంను నీట్ గా డెకరేట్​ చేసుకుంటే ఇల్లంతా అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేయడం వేరు. డెకరేట్ చేయడం వేరు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉంటే మనసు ఎంత గందరగోళంగా ఉంటుందో తెలిసిందే. అందుకే  జనవరి ఒకటి నుంచి ఇల్లు ఎప్పుడూ అందంగానే ఉంచాలి అని నిర్ణయించుకుంటే 2025అంతా అందంగా మారుతుంది.

అప్పులు వద్దు 

న్యూ ఇయర్ లో చేయాల్సిన పనుల్లో మరో ముఖ్యమైన పని అప్పులు తీర్చేయడం ఏదైనా చిన్న చిన్న అప్పులు లాంటివి ఉంటే 2024లోనే వాటిని తీర్చేయడం బెటర్. అప్పులు ఉంటే ఎప్పటికైనా టెన్షనే. అందుకే వీలైనంత త్వరగావాటిని తీర్చేయాలి. అలాగే కొత్త సంవత్సరంలో కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. యాప్స్ డిలీట్ పాత సంవత్సరంతో పాటే కొన్ని యాప్కు కూడా గుడ్ బై చెప్పేయడం బెటర్. ఎప్పటినుంచో వాడకుండా ఉన్న యాప్స్ పాటు మన టైంను బాగా తినేసే సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్ ను కూడా దూరం పెట్టడం మంచిది. కొత్త సంవత్సరంలో మొబైల్కు  ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా సమయం గడపొచ్చు..

మరింత అందంగా 

ఎవరిని వారు రీసెట్ చేసుకోవడంలో అందం కూడా ముఖ్యమే. న్యూ ఇయర్లో కొత్త హెయిర్ స్టైల్ లేదా కొత్త డ్రెస్సింగ్ స్టైల్ను ట్రై చేయొచ్చు. అలాగే చాలామంది ఫ్యాషన్​ ని  అంతగా ఫాలో అవ్వరు. మనసులో ఫాలో అవ్వాలని ఉన్నా సిగ్గుతో మొహమాటపడుతుంటారు. అందుకే ఈ న్యూ ఇయర్ నుంచి కాస్త బిడియాన్ని పక్కన పెట్టి ఫ్యాషనబుల్​ గా  ఉండడం ఎలాగో ట్రై చేయొచ్చు. ఈ రోజుల్లో అందం విషయంలో కేర్ తీసుకుంటేనే నలుగురిలో ట్రెండీగా కనిపిస్తాం.

ఆరోగ్యం 

ఇకపోతే మార్చుకోవాల్సిన అలవాట్లలో అన్నింటికంటే ముఖ్యమైంది హెల్త్ కేర్.. పోయిన సంవత్సరం న్యూ ఇయర్​కు బరువు తగ్గాలనో, ఫిట్ గా ఉండాలనో.. ఇలా ఏదో ఒక హెల్త్ పరమైన రిజల్యూషన్ పెట్టుకునే ఉంటారు. అప్పుడు అది ఎంతవరకూ ఫాలో అవ్వగలిగారో చెక్ చేసుకోవాలి. ఒక వేళ మధ్యలో ఆపేసినట్లయితే ఈసారి అలా కాకుండా జాగ్రత్త పడాలి. జీవితంలో ఎంత ప్లానింగ్ ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యంగా లేకపోతే అవన్నీ వృధానే. అందుకే న్యూ ఇయర్లో మరింత హెల్దీగా ఉండాలని ఇప్పుడే నిర్ణయించుకోవాలి.

ఇయర్ బడ్జెట్ 

మనీ మేనేజ్ మెంట్ ఎప్పుడూ ఒక ఛాలెంజ్ లాంటిదే. డబ్బుని ఎంత ఫాస్ట్గా ఖర్చు చేసినా అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అవ్వడం సహజం. అందుకే ఈ సారి ఇయర్ బడ్జెట్ వేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయొచ్చేమో ట్రై చేసుకోవాలి. నెలకు వచ్చే శాలరీ, అందులో దేనికి ఎంత శాతం ఖర్చు పెట్టాలో ఒక బడ్జెట్ రెడీ చేసుకోవాలి. దాంతోపాటీ సేవింగ్స్, ఇన్సెస్ట్ మెంట్స్ కోసం కూడా కొంత కేటాయించాలి.