ఇష్టమైన వాళ్లతో గొడవపడడం ఎవరికీ నచ్చదు. కొన్నిసార్లు ఏదో విషయంలో తగువులు వస్తుంటాయి. అయితే, ఏది జరిగినా వెంటనే మర్చిపోవాలి. లేదంటే ఇద్దరూ ఎమోషనల్ గా, సైకలాజికల్ డిస్టర్బ్ అవుతారు. వాళ్ల రిలేషన్షిప్ లో అదొక మచ్చలా ఉండిపోతుంది అంటున్నారు సైకాలజిస్టులు. అలా జరగకుండా ఉండాలంటే...
* గొడవ పడినప్పుడు బాగా ఎమోషనల్ అయినప్పుడు బయటికి వెళ్లి వాకింగ్ చేయాలి. లేదంటే జిమ్ కు వెళ్లి కష్టమైన వర్కవుట్లు చేస్తే మనసులోని బాధ తగ్గుతుంది.
* ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకుంటే రిలేషన్ షిప్ దెబ్బతింటుంది. కాబట్టి ఒకరికొకరు సారీ చెప్పుకుంటే మళ్లీ మునుపటిలా ఉండొచ్చు.
* ఒకసారి జరిగిన పొరపాటును మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. అంతేకాదు అవతలివాళ్ల ఇష్టాల్ని గౌరవించడం అలవాటు చేసుకోవాలి.
* డిస్టర్బ్ గా ఉన్నటైంలో మ్యూజిక్ వినాలి. మెడిటేషన్ చేయాలి. పెయింటింగ్ వేయడం, సినిమా చూడడం వంటివి కూడా స్ట్రెస్బస్టర్ లా పనిచేస్తాయి.