కూల్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా?

మంచినీళ్లు తాగటం హెల్త్‌‌కి మంచిదని తెలిసిందే. అయితే నీళ్లు ఎలా తాగితే మంచిది? అనే విషయంలో చాలా అనుమానాలున్నాయి. చిల్డ్ వాటర్ కంటే గోరు వెచ్చగా ఉండే నీళ్లు మంచివి అంటుంటారు. “చల్లని నీళ్లు తాగితే బరువు పెరుగుతారు” అనే మాట కూడా వింటుంటాం. అయితే నీళ్లలో ఎలాంటి కేలరీలూ, ప్రొటీన్స్ ఉండవు. మరి అలాంటప్పుడు చల్లని నీళ్లు తాగితే బరువు ఎలా పెరుగుతారు? అనే అనుమానం చాలామందికి వస్తుంది. అసలు నీళ్లు ఎందుకు తాగాలి? మన హెల్త్ కి ఏ నీళ్లు మంచివి చల్లని నీళ్లా లేదంటే గోరు వెచ్చని నీళ్లా?  అనే టాపిక్​ మీద సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ పూజా మఖిజా కొత్త విషయాలు చెప్పారు.

“జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం” మంచినీళ్లు తాగమనే చెబుతోంది. అవి వేడి నీళ్లైనా, చల్లనివైనా పెద్ద తేడా ఏమీ ఉండదు. ముఖ్యంగా మనం తాగే నీళ్లు ఎలా ఉన్నా బరువుపెరగదని అంటున్నారామె. మన శరీరంలోకి ఏ ద్రవ పదార్థం వెళ్లినా అది కొన్ని నిమిషాల్లోనే  బాడీ టెంపరేచర్‌‌‌‌కి వస్తుంది.  చల్లని నీళ్లు తాగినా, గోరు వెచ్చని నీళ్లు తాగినా శరీరం దాన్ని న్యూట్రల్ టెంపరేచర్‌‌‌‌కి మార్చుకుంటుంది. అంటే చల్లని నీళ్లు తాగితే దాన్ని బాడీ టెంపరేచర్  98 డిగ్రీల వరకూ వేడి చేయాల్సిందే.  దానివల్ల మెటబాలిజం పెరుగుతుందే తప్ప మనకి ఏమాత్రం నష్టం చెయ్యదు. సో! చల్లగా, వేడిగా ఎలా తాగినా పరవాలేదు. కానీ నీళ్లు మాత్రం కచ్చితంగా తాగమని’’ చెబుతున్నారామె.

బాడీలో అవసరమైనంత వాటర్ పర్సంటేజీ ఉండాల్సిందే. అంటే ఒక రోజులో కనీసం నాలుగు లీటర్లు తప్పని సరిగా తాగాలి. ఇంతకంటే కొద్దిగా ఎక్కువ తాగినా పర్వాలేదు. కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. సరైన వాటర్ కంటెంట్ ఉంటే నిద్ర రాకపోవటం, బ్లడ్ ఫిల్టరైజేషన్‌‌లో ఇబ్బందులు, లో బీపీ, స్కిన్ పొడి బారడం లాంటి సమస్యలు ఉండవు. కొద్దిగా దాహం వేస్తుంది అనిపించగానే నీళ్లు తాగాలి.

మంచినీళ్ల కంటే బెస్ట్ మెడిసిన్ ఇంకొకటి లేదు. నిద్రలేవగానే మంచినీళ్లు తాగితే బాడీలో ఉండే టాక్సిన్స్ ఫిల్టర్ అయిపోతాయి. రక్తం శుభ్రపడుతుంది. చర్మం మెరుస్తుంది. కావాలంటే ఒక వారం పాటు ప్రతీరోజూ…నిద్ర లేవగానే రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగి చూడండి మార్పు మీకే తెలుస్తుంది” అంటున్నారు పూజా మఖిజా.

For More News..

ఆక్స్​ఫర్డ్​ డిక్షనరీలోకి ‘ఆత్మనిర్భరత’

ఢిల్లీ బ్లాస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో దొరికిన లెటర్‌‌‌‌‌లో ఏముందంటే?

ఐసీసీ అవార్డు రేసులో పంత్