
ఇంటికి ఎవరైనా గెస్ట్లు.. బంధువులు.. స్నేహితులు వచ్చినప్పుడు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండిని తయారు చేసుకుంటాం. అందులో కొంత మాత్రమే ఉపయోగిస్తాం.. ఆపిండి మిగిలిపోతే ఏం చేయాలో అర్దం కాదు. పులిసి పోతుంది.. ఎండాకాలం త్వరగా పులిసిపోతుంది. ఫ్రిజ్ లో పెట్టినా సరే కొంతవరకు బాగుంటుంది. మిగిలిపోయిన పిండితో ఎంతో రుచికరమైన పదార్దాలు చేసుకోవచ్చు... ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
ఇడ్లీ పిండి మిగిలిపోతే దానిని ఏం చేయాలో అర్దం కాక పంచి పెడుతుంటారు. అలా పంచి పెట్టకుండా మీరే ఎంచక్కగా టేస్టీ పదార్దాలు తయారు చేసుకోవచ్చు. మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో తురిమిన కొబ్బరి కొబ్బరి కలపండి. ఇడ్లీ పాత్రకు కొద్దిగా నూనె గాని నెయ్యి గాని రాసి చిన్న చినన ఉండలుగా చేసి వాటిని అందులో ఉంచి ఆవిరిపై ఉడికించండి. రాత్రి వేళలో భోజనంకు బదులు అల్పహారంగా ఇది తింటే తేలిగ్గా అరుగుతుంది.
దోసె: క్రిస్పీగా మెత్తగా ఉండాలంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో కొబ్బరి తురుము కలిపి తయారు చేసుకోవచ్చు. ఇంకా మెత్తని ఉప్మా..వేయించిన స్నాక్స్.. అన్నీ వీటితో తయారు చేసుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా బియ్యం పిండి, బెల్లం, జీలకర్ర, అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మొదలైనవి కలపాలి. వీటితో పాటుగా కొన్ని క్యారెట్.. క్యాబేజీ లాంటి కూరగాయలు కలపాలి. పాన్ వేడి చేసి కొంచెం పిండి మందంగా పోసి గంటెతో పల్చగా చేయండి. ఆ తరువాత బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా క్రిస్పీగా వేయించండి. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని పెరుగులో నంజుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.