Health tips: కాలేయం సమస్యలున్నాయా..చెరుకు రసంతో మంచి ఫలితాలు

Health tips: కాలేయం సమస్యలున్నాయా..చెరుకు రసంతో మంచి ఫలితాలు

చెరుకు రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎండాకాలంలో వేడిమినుంచి ఉపశమనం, జీర్ణక్రియను మెరుగుపర్చడం, బరువు నియంత్రణ, మూత్ర పిండాలు,కాలేయం ఆరోగ్యం ఉంచడం చెరుకు రసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెరుకు రసం తాగడం వల్ల మన కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కామెర్ల నివారణకు.. 

చెరుకు రసం కామెర్ల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. NCBI ప్రకారం.. యునాని వైద్య విధానం కామెర్ల రోగులకు చెరకు రసాన్ని మంచి ఫలితాలునిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువ మొత్తంలో చెరకు రసం తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుందంటున్నారు. 

చెరకు రసంలో అనాల్జేసిక్ , యాంటీ ఇన్ ఫ్లామేటరీ, డైయూరిటిక్, యాంటీ హైపర్ గ్లైసిమిక్, హెపాటోప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ వంటి వివిధ బయోయాక్టివిటీలు ఉన్నాయి అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ జీవసంబంధమైన కార్యకలాపాలు, సమ్మేళనాల కారణంగా చెరకు రసం కామెర్లపై ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. 

అంతేకాదు చెరకు రసంలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయ పడతాయి. బైలిరుబిన్ స్థాయిలను నియంత్రించడంతో కీలక పాత్ర పోషిస్తాయి. 

చెరకు రసం పోషకాల గని. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ సీ, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే చెరకు రసాన్ని తగిన మోతాదులో తీసుకుంటే ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. 

చెరకు రసం ప్రయోజనాలు: 

  • కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది
  • బిలిరుబిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది
  • జీర్ణక్రియకు సహాయపడుతుంది
  • ప్రేగులను శుభ్రపరుస్తుంది
  • శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
  • గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మంచిది

చెరకు రసం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు: 

కొంతమంది వ్యక్తులు చెరకు రసం తిన్న తర్వాత ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు.
రసంలో అధిక ఫైబర్ కంటెంట్ లేదా చెరకులో ఉండే కొన్ని కార్బోహైడ్రేట్లకు ఒక వ్యక్తి యొక్క నిర్దిష్ట సున్నితత్వం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.