Northern Lights:ఆకాశంలో రంగుల తుపాను ‘అరోరా’ గురించి మీకు తెలుసా?

Northern Lights:ఆకాశంలో రంగుల తుపాను ‘అరోరా’ గురించి మీకు తెలుసా?

ఆకాంలో రంగుల తుపాను.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఆకాశమంతా రంగులమయం అయింది. ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో ఈ రంగుల వెలుగులు జిగేల్ మం టూ కనిపించాయి. ఇంతకీ ఆకాశంలోకి ఈ రంగులు ఎలా వస్తాయి..ఈ రంగులతో మనుషులకు ఏమైనా హాని ఉందా..? వివరాలు చూద్దాం..

నార్తర్న్ లైట్స్ అని పిలిచే ఈ రంగుల వెలుగులను అరోరా బోరియాలిస్ అని కూడా అంటారు. ఇటీవల నెదర్లాండ్స్ లోని మోలెన్ విర్గాంగ్ మిల్ మీదుగా ఆకాశంలో అరోరా బోరియాలిస్ కనుల విందు చేసింది. ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ క్రాస్బీ బీచ్‌లో ఉన్న ఆంథోని గోర్మెలీ విగ్రహం మీదుగా నార్తర్న్ లైట్స్ కనిపించాయి. స్విట్జ ర్లాండ్‌లోని డైలెన్స్ గ్రామంలో కూడా  అరోరా అందమైన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. స్కాట్లాండ్‌లోని క్వీన్స్‌ఫెర్రీ బ్రిడ్జి మీద కూడా ఊదా, ఆకుపచ్చ రంగు లతో ఆకాశం అందంగా కనిపించింది. అందమైన రంగుల రిబ్బన్ మాదిరిగా కనిపించే ఈ వెలుగులు .. ఓ భీకరమైన జియోమాగ్నటిక్ తుఫాన్ ప్రభావం.

2003లో ఇలాంటి భీకరమైన తుఫాన్ సంభవించింది. అయితే భూమ్మీద జీవించే ప్రాణాలు ఉలాంటి ప్రమాదం ఉండదు. సూర్యుడి నుంచి వెలువడే ధూళికణాలు అంతరిక్షంలో భూ ఉపరితల వాతావరణాన్ని గంటలకు 7 కోట్ల కిలోమీటర్ల వేగంతా తాకినప్పుడు ఈ పరిణామం జరుగుతుంది. 

అరోరాలు ఎలా ఏర్పడతాయి?

నార్తర్న్ లైట్స్ లేదా అరోరా బోరియాలిస్ అనేవి రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన రంగుల్లో కనిపిస్తాయి. ఇవి ఆకుపచ్చ, గులాబీ, సింధూరం వంటి పలు రంగు ల్లో ఏర్పడతాయి. సూర్యుని నుంచి వెలువడిన చార్జ్‌డ్ కణాలు భూ వాతావరణంలోకి వాయువులతో ఢీకొన్నప్పుడు నార్తర్న్ లైట్స్ ఏర్పడతాయి.సూర్యుని నుంచి వచ్చిన చార్జ్‌డ్ కణాలతో భూమి వాతావరణంలోని వాయువులు శక్తిమంతం కావడంతో ఆకాశంలో వివిధ రంగులు ఏర్పడతాయి.

భూమి వాతావరణంలో అత్యంత సాధారణ వాయువులు నైట్రోజన్, ఆక్సీజన్.. ఆక్సీజన్ వాయువు శక్తిమంతంగా మారినప్పుడు అందులోని పరమాణువులు ఆకుపచ్చ రంగు లో మెరుస్తాయి. నార్తర్న్ లైట్స్‌లో తరచుగా ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. నైట్రోజన్ పరమాణులు ఊదా రంగు, నీలం రంగు, గులాబీ రంగుల్లో మెరుపును సంతరించుకుంటాయి.

కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనే భారీ కణాలను సూర్యుడు ఉద్గారం చేసినప్పుడు అత్యంత ఆకర్షణీయమైన అరోరాలు ఏర్పడతాయి.