ఒక మనిషి విలువ తన మాట్లాడే విధానంలోనే తెలుస్తుంది. మాట్లాడటం అనేది ఒక అందమైన కళ.. మౌనంగా ఉండటం అంతకంటే అద్భుతమైన కళ. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరు గంటసేపు మౌనంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి కొన్ని వందల మాటల్లో చెప్పలేనిది కూడా ఒక అర్థవంతమైన నిశ్శబ్ధం సూచిస్తుంది. అది మన మనసుకు అద్దం పడుతుంది.
ఈ కాలంలో బయటకు వెళితే.. బయంకరమైన శబ్ధాలతో విసుగెత్తి పోతున్నాం. కాబట్టి నిశ్శబ్ద వాతావరణంలో.. మనస్సు ప్రశాంతంగా ఉంచి రోజుకు ఒక గంట సమయం గడిపితే.. మానసిక ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక గంట మౌనంగా ఉండటం వల్ల ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఈ స్టోరీలో చూద్దాం..
స్ట్రెస్ రిలీఫ్..
ఒక గంట సేపు ఎలాంటి విషయాల గురించి ఆలోచించకుండా.. ప్రశాంతంగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, భయం మొదలైన వాటిని నుంచి రిలీఫ్ పొందవచ్చు. నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు... దీనివల్ల ఒత్తిడి అనేది తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
గుండె సమస్యలు తగ్గుతాయి..
రోజూ ఒక గంట సేపు మౌనంగా, ప్రశాంతంగా ఉండటం వల్ల గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని వెల్లడించారు వైద్యులు.
క్రియేటివిటీ పెరుగుతుంది..
మౌనంగా ఉండటం వల్ల క్రియేటివిటీ థాట్స్ అనేవి పెరుగుతాయి. కళాకారులు, రైటర్స్ వీలైనంత వరకూ ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల క్రియేటివిటీ థాట్స్ ఎక్కువగా వస్తాయి.
కమ్మూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి..
నిశ్శబ్దంగా ఉండటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. సైలెంట్ గా ఉంటే.. మీరు మాట్లాడే ప్రతి పదాలను మరింత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడగలుగుతారు. అలాగే ఎదుటివాళ్లు మాట్లాడిన ప్రతి మాటను శ్రద్ధగా వినడం వంటివి నేర్చుకుంటారు. అవగాహన సానుభూతిని పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
నిద్ర బాగా వస్తుంది..
సైలెంట్ గా ఉండటం వల్ల నిద్ర బాగా మెరుగు పడుతుంది. మంచి నిద్ర వల్ల మనసు కూడా రిలాక్స్ అవుతుంది. దీంతో ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బీపీ కంట్రోల్..
ప్రతి రోజు గంట సేపు మాట్లాడకుండా, ప్రశాంతంగా ఉండే.. బీపీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. బీపీ అదుపులోకి వస్తుంది. దీని వల్ల గుండె సమస్యలు, హార్ట్ స్ట్రోక్ వంటికి రాకుండా ఉంటాయి.