ప్రపంచంలో అత్యంత బరువైన వ్యక్తి.. 542 కిలోలు తగ్గాడు..ఎలా సాధ్యమైంది?

సౌదీ అరేబియా వాసి ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ.. ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి.. పదేళ్ల క్రితం అతడి బరువు..610 కిలోలు..అధిక బరువు కారణంగా ఏ పనీ చేయలేకపోయేవాడు. చిన్న చిన్న పనులకు కూడా అతను ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మూడేళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యాడు. దాదాపు చని పోయే స్థితికి చేరింది అతని పరిస్థితి.. ఆ సమయంలో సౌదీ అరేబియా రాజుకు తెలిసింది. ఖలీద్ ఆరోగ్యం, బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిన రాజు.. 10యేళ్ల కృషి.. ఖలీద్ జీవితంలో అనూహ్యం సంఘటన.. ఇప్పుడు అతను సాధారణ మనిషి.. ఎలా సాధ్యం..  

సౌదీరాజు ఫోకస్..30 మంది వైద్యులు ఖలీద్ కు చికిత్స ప్రారంభించారు. ఖలీద్ ను ఫోర్క్ లిఫ్ట్ , ప్రత్యేకమైన మంచం సహాయంతో సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తీసుకెళ్లారు. 

ఇక్కడ ఖలీద్ కు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. చాలా కాలం పాటు ప్రత్యేక ఆహారం, వ్యాయామంతో విస్తృతమైన చికిత్స పొందాడు. మొదటి ఆరు నెలల్లో ప్రత్యేక సంరక్షణలో ఉన్న ఖలీద్ తన శరీర బరువు దాదాపు సగం తగ్గాడు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడేందుకు ఫిజియోథెరపీ కూడా చేశారు. 

వైద్యులు, ఖలీద్ సంవత్సరాల కృషి ఫలితంగా 2023 సంవత్సరం చివరి నాటికి అతని బరువు 63.5 కిలోలకు చేరుకుంది. అనూహ్యంగా దాదాపు 542 కిలోల బరువు తగ్గాడు. బరువు తగ్గిన తర్వాత ఖలీద్ అదనపు చర్మాన్ని తొలగించడానికి అనేక శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అత‌డు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. ఖలీద్ కు స్మైలింగ్ పర్సన్ అని పేరు కూడా పెట్టారు అతని వైద్యం చేసిన డాక్టర్లు.