Helath tips: ఒబెసిటీతో బాధపడుతున్నారా?..ఫ్రాన్స్లో చేసినట్టు చేయండి. ఇట్టే కంట్రోల్ అవుతుంది

Helath tips: ఒబెసిటీతో బాధపడుతున్నారా?..ఫ్రాన్స్లో చేసినట్టు చేయండి. ఇట్టే కంట్రోల్ అవుతుంది

ఊబకాయం(ఒబెసిటీ)  అనేది ఇప్పుడు గ్లోబల్ ఇష్యూ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉబకాయంతో బాధపడుతున్నారు. ఒబెసిటీ కారణంగా స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు మొదలైన సమస్యలతో ప్రతి యేటా లక్షలాది మరణాలకు చనిపోతున్నారు. ఇండియాలో కూడా లక్షల్లో ఒబెసిటీ పేషెంట్లు ఉన్నారు. రోజురోజుకు తీవ్రతరం అవుతున్న ఒబెసిటీ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన ఎక్కువవుతోంది. ఒబెసిటీని అధిగమించే మార్గాలపై అన్వేషణ సాగుతోంది. ఇలాంటి క్రమంలో మనం ఫ్రాన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అతి తక్కువ ఒబెసిటీ సమస్య ఉన్న దేశం ఫ్రాన్స్. మరీ ఫ్రెంచి ప్రజల్లో ఒబెసిటి ఎందుకు అంత తక్కువగా ఉంది..ఒబెసిటి నియంత్రణలో మనం వారినుంచి ఏమైన నేర్చుకోవచ్చా ఈ ఆర్టికల్ తెలుసుకుందాం. 

ఆరోగ్యం..ఫ్రెంచ్ సంప్రదాయ ఆహారం..

ఫ్రెంచి ప్రజల్లో ఉబకాయ సమస్య లేకపోవడానికి కారణం వారి సాంప్రదాయ ఆహారమేనట. ఫ్రెంచి ప్రజలు చీజ్, ప్రెస్టీలు, వైన్ లు, క్రీమీ సాస్ లు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఆహారాన్ని మితంగా తింటారు.చిన్న చిన్న భాగాలుగా తింటారట. దీంతోపాటు వాటి సాంస్కృతిక అలవాట్లు, ప్రభుత్వ విధనాలు, జీవనశైలి ఒబెసిటీని ఎదుర్కోవడంలో కీలకంగా ఉన్నాయట. ఒబెసిటీలో అదుపు చేయాలంటే..ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు,వ్యాయామం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. 

ఫ్రెంచి ప్రజలు తమ ఆహారాన్ని సాధ్యమైనంత చిన్న భాగాలుగా తయారు చేసుకుంటారు. తినడం విషయంలో వారు ప్రత్యేకమైన సమయం కేటాయించి తీరిగ్గా తింటారట. రుచులను ఆస్వాదించడమే కాదు కడుపునిండిన తర్వాత ఆహారం ముట్టుకోరట. అతిగా తినకపోవడం అనేది వారి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుందట. అంతేకాదు ప్రాసెస్డ్ పాస్ట్ ఫుడ్ కు ఫ్రాన్స్ ఫేమస్ అయినప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే తింటారట. 

►ALSO READ | Summer Tips : మీ ఫ్రిజ్ కంపు కొడుతుందా.. బ్యాడ్ స్మెల్ వస్తుందా.. క్లీనింగ్ ఇలా చేయండి.. !

ఫ్రెంచి ప్రజలు వాకింగ్ బాగా చేస్తారట. కేలరీలను బర్న్ చేసేందుకు చిన్న చిన్న పనులు చేయడం, ఆరుబయట పనిచేయడం వంటివి చేస్తారట. 
ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఒబెసిటీ విషయంలో చాలా  కేర్ తీసుకుంటుంది. స్కూళ్లలో ఒబెసిటీని పెంచే సోడా, స్నాక్స్ వెండింగ్ మెషీన్లను నిషేధించారు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలపై అధిక పన్ను, పిల్లలకు జంక్ ఫుడ్ యాడ్స్ తగ్గించడం  వంటి ప్రజారోగ్య చర్యలు చేపడుతోంది. 

ఓవరాల్గా ఒబెసిటీ నియంత్రించడంతో  ఫ్రాన్స్ మనకు ఏం చెబుతుందంటే.

  • తాజా పండ్లు తినాలి. చిన్న చిన్న భాగాలుగా కట్ చేసి తినాలి. 
  • ఇంట్లో వండిన ఆహారం తీసుకోవాలి. 
  • పిల్లలతో సహా ఇంట్లో వారందరికి వంట చేయడం నేర్చుకోవాలి 
  • భోజనం మధ్యలో స్నాక్స్ తినకుండా జాగ్రత్తపడాలి 
  • వ్యాయామం తప్పకుండా చేయాలి. నడక, యాక్టివ్ గా ఉండే జీవనశైలి అలవాటు చేసుకోవాలి. 
  • పిల్లల్లో చిన్ననాటినుంచే పోషకాహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై ప్రోత్సహించాలి. 
  • సో.. ఒబెసిటీని నియంత్రించాలంటే మీరు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్.