బ్రిటిష్ ఏళ్ల నాటి చట్టాల ప్లేస్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు చట్టాలను తీసుకువచ్చింది. 2023లో పార్లమెంట్ ఆమోదం తెలిపిన ఆ చట్టాలు 2024 జూలై 1 నుంచి అమలు అవుతున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ కు బదులు భారతీయ న్యాయ సంహిత ను తీసుకువచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తే BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు చేస్తే 10ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు.
ఉద్యోగం, ప్రమోషన్ లాంటివి ఆశ చూపించి, ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మోసం చేస్తే సెక్షన్ 69లో నేరం రుజువైతే.. 10ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందే.. అయితే ఈ చట్టాల వల్ల ఉద్దేశపూర్వకంగా పురుషులను వేధించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు ఆంధోళన చెందుతున్నారు. చీటింగ్ చేసి లైగింక సంబంధాలకు పాల్పడితే BNS సెక్షన్ 69 పురుషులకు, స్త్రీలకు వర్తిస్తుంది. న్యాయ స్థానాలు దీని అమలు ఏలా చేస్తాయని ఆసక్తి కరంగా మారింది. నేరం జరిగిందని గుర్తించడం, ఆధారాలు సేకరించడం వంటి అంశాలు ఈ చట్టాల్లో కాస్త కఠినంగా ఉన్నాయి.