రాజకీయాలు అంటే పైసలు కావాలి.. చాలా ఉండాలి.. సారీ సారీ చాలా చాలా డబ్బులు కావాలి.. ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో పోటీ చేయాలంటే కొంచెం ఉంటే సరిపోతుంది.. అలా కాకుండా ఓ రాజకీయ పార్టీ పెట్టాలంటే.. మామూలుగా ఉండదు వ్యవహారం. బయటకు చెప్పేది 10 పైసలే అయినా.. వాస్తవ లెక్క మాత్రం వేల కోట్లలోనే ఉంటుంది. రాజకీయ పార్టీ నడపాలంటే ఆషామాషీ కాదు.. నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు పెట్టాలి.. ప్రోగ్రామ్స్ చేయాలి.. బ్యానర్లు కట్టాలి.. ప్లెక్సీలు వేయాలి.. ఒకటి ఏమిటి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ అంటే వేల కోట్లు కావాల్సిందే.. మరి అలాంటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కొత్తగా పార్టీ పెట్టిన తమిళనాడు ఇళయ దళపతి హీరో విజయ్ దగ్గర ఎంత ఆస్తి ఉంది.. ఎంత డబ్బు ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. రాజకీయ పార్టీ పెట్టినట్లు ప్రకటించిన వెంటనే.. విజయ్ ఆస్తులు ఎంత అనే ప్రశ్న మాత్రమే కాదు.. గూగుల్ లో తెగ వెతికేశారు నెటిజన్లు.
హీరో విజయ్ ఆస్తులు.. 2023 జనవరి నాటికి.. గూగుల్ లో వివిధ కథనాల ప్రకారం స్థిరాస్తులు 445 కోట్లు.. అంటే ఇళ్లు, పొలాలు, స్థలాలు ఇలా.. స్థిరాస్థిగా ఆయన ఇన్ కం ట్యాక్స్ అధికారులకు చూపించింది 445 కోట్ల రూపాయలు అంట.. ఇది గవర్నమెంట్ వ్యాల్యూనే.. మార్కెట్ వ్యాల్యూ ఐదారు ఇంతలు ఉండొచ్చు.. ఇవన్నీ స్థిరాస్తులు.. మరి రాజకీయం చేయటానికి ఈ డబ్బు సరిపోతుందా అంటే.. నిజాతీయతో కూడిన రాజకీయం చేయటానికి.. డబ్బు పంచని.. మందు పంచని రాజకీయం చేయటానికి అయితే చాలు అంటున్నారు విజయ్ ఫ్యాన్స్..
సినిమాల్లో రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్‌లో విజయ్ ఒకరు. రజినీకాంత్, షారుఖ్, అక్షయ్ కుమార్ వంటి నటులకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. రీసెంట్గా జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో వచ్చిన బీస్ట్ సినిమాకు రూ.100 కోట్లు తీసుకున్నట్లు టాక్. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు మూవీకి రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ రూపంలో ముట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
also read :- నాగోబాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
విజయ్ ఇప్పటి వరకు 61 చిత్రాలలో నటించి.. ఎన్నో అవార్డ్స్ తో పాటు పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. విజయ్ కి అంతర్జాతీయ స్థాయిలో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, ఒక కాస్మోపోలిటన్ పురస్కారం, ఎనిమిది విజయ్ పురస్కారాలు, మూడు ఎడిసన్ పురస్కారాలు, రెండు వికటన్ అవార్డులు దక్కించుకున్నాడు. మరి రాజకీయాల్లో రాణిస్తాడో లేదో.. ప్రజలు ఆదరిస్తారో లేదో చూడాలి...