ఒకప్పుడు ఏదైనా సినిమా వందకోట్లు సాధించడం అంటే అందని ద్రాక్ష అనేలా ఉండేది. కొన్నిసార్లు పెట్టిన బడ్జెట్ కూడా వస్తుందో లేదో అనే సందేహం ఉండేది. అలా చాలా సినిమాలు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కి.. కేవలం లక్షలు మాత్రమే కలెక్ట్ చేసిన సందర్భాలున్నాయి. టాక్ మంచిగా ఉంటే దుమ్ములేపుతున్నాయి. ఇక ఎంత పెద్ద హీరో సినిమా అయిన కథలో కంటెంట్ లేకపోతే, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి.
అయితే, ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందే ఆడేస్తున్నాయి.. వసూళ్లు చేసేస్తున్నాయి. ఇటీవలే పుష్ప 2 మూవీ రిలీజ్ కి ముందే రూ.1000 కోట్లకి పైగా బిజినెస్ చేసింది. ఇది మొట్టమొదటి ఇండియన్ సినిమాగా అరుదైన ఘనత సాధించింది.
అంతకుముందు భారీ అంచనాలతో రిలీజైన కల్కి, బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘RRR’ సినిమాలు వెయ్యి కోట్ల మార్కును ముద్దాడాయి. కానీ, రిలీజ్ కు ముందు మాత్రం వెయ్యి కోట్ల బిజినెస్ చేసిందంటే పుష్ప 2 మాత్రమే.. అయితే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. రిలీజ్‌కి ముందు రూ.100 కోట్ల బిజినెస్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఏంటో తెలుసా? సౌత్, నార్త్ లో ఎంతో మంది స్టార్ హీరోస్ ఉన్నప్పటికీ.. ఈ ఘనత సాధించింది మాత్రం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రమే. మరి ఆ సినిమా ఏంటీ? వివరాల్లోకి వెళితే..
మోహన్‌లాల్ హీరోగా రూపొందిన పీరియాడికల్ మూవీ ‘మరక్కార్: లయన్ ఆఫ్ ది ఆరేబియన్ సీ'. పదహారో శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ప్రియదర్శన్ తెరకెక్కించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 4100 థియేటర్లలో రిలీజై రూ.100కోట్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక కమర్షియల్‌గా మెప్పించలేకపోయింది.
కానీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, కాస్ట్యూమ్ డిజైనర్, స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరిల్లో నేషనల్ అవార్డ్స్ సాధించింది. 50వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్ కొరియోగ్రాఫీ, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకుంది. నిజానికి ఈ సినిమాని 2020 మార్చిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ వాయిదా పడి 2021 డిసెంబర్‌లో రిలీజ్ అయ్యింది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.