ప్రపంచంలోనే అత్యంత పొడవైన వార్డ్రోబ్ ఎక్కడుందో తెలుసా? మనిషి నడిపే లిఫ్ట్ ను ఎప్పుడైనా చూశారా? ఇవే కాదు. ఇలాంటివి హైదరాబాద్లో ఇంకెన్నో ఉండేవి. ప్రస్తుతం అవి మ్యూజియాల్లో భద్రంగా ఉన్నాయి. వాటిలో కొన్ని నిజాం రాజుకు గిఫ్ట్ గా వచ్చినవి, మరికొన్ని ఆయన చేయించుకున్నవే. అవేంటో చూద్దామా....
హైదరాబాద్ వెలుగు : మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్ స్టేట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఏడో నిజాం ప్రభువు. 1911లో రాజైన అలీఖాన్ 1936 నాటికి పాలన మొదలు పెట్టి పాతికేళ్లైంది. ఆ సందర్భంగా 1937 ఫిబ్రవరి 13న పబ్లిక్ గార్డెన్ జూబ్లీహాల్లో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేశారు. ఆ వేడుకలప్పుడు ఆయనకు వచ్చిన బహుమతులు అన్నీ ఇన్నీ కావు. 2000 సంవత్సరంలో వాటన్నింటితో పురానీ హవేలిలో ''నిజాం మ్యూజియం' ఏర్పాటు చేశారు.
నిజాం అధికారిక నివాసాన్ని 'పురానీ హవేలి ఖరీమ్' అని పిలిచేవాళ్లు దీన్ని 1803 నుంచి 1829 వరకు నిర్మించారు. ఇది 'U' ఆకారంలో ఉంటుంది. ప్రస్తుతం ఇందులో కుడివైపు ముకరంజా ట్రస్ట్ నిజాం ట్రస్ట్ ఆధ్వరంలో వేర్వేరు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఎడమవైపు భాగంలో నిజాం మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం నగరంతోపాటు దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటోంది.
145 అరల వార్డ్ రోబ్
మ్యూజియంలో ప్రంపంచంలోనే అత్యంత పొడవైన వార్డ్ రోబ్ ఉంది. రెండు అంతస్తుల్లో బర్మ కలపతో దీన్ని తయారు చేశారు. 245 అడుగుల పొడవు. 143 అరలు ఉన్నాయి. బట్టలు, కాస్మొటిక్స్, చెప్పులకు ప్రత్యేకమైన అరలున్నాయి
స్పెషల్ లిఫ్ట్
ప్రస్తుతం మనం చూస్తున్న లిప్ట్‌లన్ని స్విచ్ నొక్కగానే ఏ అంతస్తుకు కావాలంటే అంతస్తుకు తీసుకెళ్తాయి. నిజాం కాలంలో కూడా లిప్ట్‌లు ఉండేవి. కానీ...! -స్విచ్ నొక్కితే పనీ చేసేవి కావు. తాళ్లుకట్టి లాగేవి. అలాంటి లిప్ట్‌ను ఈ మ్యూజియంలో చూడొచ్చు. నవాబు లిప్ట్‌లోకి ఎక్కగానే తాడుతో లాగేవాళ్లు దాంతో లిప్ట్‌పై అంతస్తుకు వెళ్లేది.
రంగుమారితే
ప్రభువుల ప్రాణాలకు ఎప్పుడు ఎలాంటి ముప్పు ఉంటుందో తెలియదు. కాబట్టి వాళ్లు తినే ఫుడ్ ముందుగా పరీక్షిందేవాళ్లు. అయితే ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ అప్పట్లో లేదు. కాబట్టి వాళ్లకు తెలిసిన పద్దతుల్లో పరీక్షించేవాళ్ళు. పుడ్‌ను ముందుగా సిలిడాన్ పళ్లెంలో పెట్టేవాళ్లు. అందులో విషం ఉంటే పళ్లెం రంగు మారడమో లేదా. పగిలిపోవడమో జరుగుతుంది. ఇప్పుడు. చాలామంది కాఫీ కప్పులపై తమ బొమ్మలు వేయించుకుంటున్నారు. ఇది ఈ మధ్య ట్రెండ్. కానీ, చాలా ఏళ్ల క్రితమే నిజాం నవాబు ఈ ట్రెండ్ ఫాలో అయ్యాడు. గ్లాసులు, సీసాలపై అప్పట్లో ఆయన చిత్రాలను ముద్రించారు. ఈ గిఫ్ట్లు ఫ్రాన్స్ నుంచి వచ్చాయి.
అంతా బంగారమే
కొత్తగా బిల్డింగ్లు కట్టాలంటే ముందుగా సమూనాలను తయారు చేస్తారు. ఇప్పటి ఇంజనీర్లు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో వాటిని చేస్తుంటారు. మరి అప్పట్లో దేంతో చేసేవాల్లో తెలుసా? బంగారం, వెండి కట్టేవాళ్లు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాను వంద కిలోల వెండితో తయారు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నమూనా తయారు చేయడానికి 30 కిలోల వెండి పట్టింది. ఇక జూబ్లీహాల్ నమూనా అయితే పూర్తిగా బంగారంతో తయారు చేశారు. అవన్నీ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే. బంగారు లంచ్ బాక్స్.. దీన్ని రెండున్నర కిలోల బంగారంతో తయారు చేశారు.
త్రీడి చిత్రం భలే విచిత్రం
ప్రస్తుతం మసం త్రీడి కాలంలోకి వచ్చాం.. అయినా అది ఇంకా అందరికీ అందుబాటులో లేదు కానీ.. నిజాంకాలంలో రాజుల నిలువెత్తు చిత్రపటాలను త్రీడి గీశారు. చౌమహల ప్యాలెస్లో అజాంజాహీ బహదూర్ చిత్రపటాన్ని ఎటువైపు నుంచి చూసినా.. బహదూర్ మనలేనే చూసినట్లు కనిపిస్తుంది.
ఇంకెన్నో
ఈ మ్యూజియంలో ఇంకెన్నో ప్రత్యేకమైన వస్తువులున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ కళాకారులు నిజాంకు గిఫ్ట్ గా ఇచ్చిన 'ఏనుగుపై మావటివాడు' ఉన్న బొమ్మ ఎంతో స్పెషల్ పాల్వంచ రాజు వెండితో చేయించిన పొన్నచెట్టుపై కృష్ణుడి విగ్రహం ఆచెట్టు కింద గోపికలు నాట్యం చేస్తున్న ప్రతిమ, వజ్రాలు పొదిగిన టీకప్పు, వజ్రాలు, పచ్సలతో తయారైన దర్మామీటర్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇరాన్లోని బస్ర పట్టణంలో దొరికిన పెద్ద ముత్యాలు పొదిగిన చేతికర్ర.. ఆకర్రకు అమర్చిన ముత్వంపై అందమైన యువతి ముఖం అద్భుతంగా ఉంటుంది. అలీఖాన్ ఊగిన వెండి ఉయ్యాల నిజాం కొడుకులు ముకరంజా. ముఫకంతా బహదూర్ తోపాటు ఆయన కోడళ్లు మైన్స్ దురైషహ్కర్, ప్రిన్స్ నీలోఫర్ ల చిత్రాలు
ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
అన్నీ ఇక్కడే..
నిజాం ప్రభువుకు వచ్చిన గిఫ్ట్లు మొత్తం ఇక్కడే ఉంచారు. 2000 సంవత్సరం నుంచిహెచ్, ఈహెచ్ నిజాం జుబ్లీ పెవిలియన్ ఆధ్వర్యంలో ప్రదర్శనశాల నడుస్తోంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం. 5 గంటలవరకు ఉంటుంది. ప్రతి శుక్రవారం మూసివేస్తాం. టిక్కెట్ 100 రూపాయలు.
-అహ్మద్ ఆర్ మ్యూజియం క్యూరేటర్