రజినీ మనవడిగా చేసిన ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సోషల్ మీడియా స్టార్

జైలర్(Jailer) సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) మనవడిగా నటించిన ఆ బుడ్డోడు గుర్తున్నాడా? అయినా ఆ రజినీకాంత్ నే బయపెట్టించుకున్న ఆ చిచ్చర పిడుగును ఎలా మర్చిపోగలం చెప్పండి. తన బుజ్జి బుజ్జి మాటలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అయితే ఈ రిలీజ్ నుండి ఈ బుడ్డోడు ఎవరు అనే సందేహం అందరికీ వచ్చింది. 

ALSO READ : విజేత సూపర్ మార్కెట్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ కమీషనర్

ఆ బుడ్డోడి పేరు రుత్విక్(Ruthwik). సినిమాలోకి రాకముందు ఈ చిన్నోడు సోషల్ మీడియా స్టార్. ఈ పిల్లోడికి యూట్యూబ్ లో 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు మనోడికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పడానికి. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలు అందుకున్నాడు రుత్విక్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rithvik J (@rithvik_rithu_j)

ఇటీవల తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ సినిమాలో కూడా నటించాడు రుత్విక్. ఈ సినిమాలో తన నటన ఎమోషనల్ నటనతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాడు ఈ అబ్బాయి. ఈ సినిమాలో రుత్విక్ నటనకు ఇంప్రెస్ అయిన దర్శకుడు నెల్సన్ జైలర్ సినిమా కోసం సెలెక్ట్ చేశాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. దర్శకుడు నెల్సన్ కు రుత్విక్ బంధువు కూడా అవుతాడట. ఇక తన అద్భుతమైన నటనతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ఈ బుడ్డోడు ఫ్యూచర్ లో ఇంకెన్ని మంచి మంచి సినిమాలు చేస్తాడు చూడాలి.